twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    850 మంది రైతులకు రుణమాఫి.. అమితాబ్ బచ్చన్ షాకింగ్ నిర్ణయం

    |

    బాలీవుడ్ దిగ్గజం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విశిష్ట కార్యక్రమానికి సిద్ధమయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌లో రుణాల బారిన పడిన 850 మంది రైతులను ఆదుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతులను రుణ విముక్తి చేసే ప్రయత్నాన్ని భుజాన ఎత్తుకొన్న అమితాబ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరో అనే మాట అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నది. సినీ ప్రముఖులు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బిగ్‌బీ అన్నదాత కోసం నడుం బిగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రైతు రుణమాఫీ గురించి అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించిన విషయం ఏమింటంటే..

    850 మంది రైతులకు మాఫి

    850 మంది రైతులకు మాఫి

    ఉత్తర ప్రదేశ్‌లో రుణాల బారిన పడిన సుమారు 850 మంది రైతులను గుర్తించాం. సుమారు రూ.5.5 కోట్ల రూపాయలను వారి తరఫున చెల్లించే బాధ్యతను తీసుకొన్నాం. బ్యాంకు అధికారుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని అమితాబ్ వెల్లడించారు.

    మరణించిన రైతు కుటుంబాలను

    మరణించిన రైతు కుటుంబాలను

    ఇటీవల మహారాష్ట్రలో అప్పుల బారిన పడి మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా గుర్తించి వారికి బిగ్‌బీ సహాయం అందించిన విషయం తెలిసివదే. బిగ్ బీ సహాయం ద్వారా దాదాపు 44 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరింది.

    అన్నదాత ఆత్మహత్యలు చేసుకోవద్దని

    అన్నదాత ఆత్మహత్యలు చేసుకోవద్దని

    దేశానికి వెన్నుముకగా నిలిచిన అన్నదాత ఆత్మహత్యలు చేసుకోకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమారు 350 మంది రైతులు మహారాష్ట్రలో రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలిసింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న వారిని ఎలాగైన ఆదుకొంటాను అని బ్లాగ్‌లో పేర్కొన్నారు.

    జీవితంలో నాకు సంతృప్తి

    జీవితంలో నాకు సంతృప్తి

    మహారాష్ట్రలో రైతు కుటుంబాలను రుణ విముక్తి చేయడం జీవితంలో నాకు సంతృప్తి లభించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని రైతులను ఆదుకొంటాం. ఎలాగైనా రైతులకు ఊరట కలిగించే కార్యక్రమలు చేపడుతాను అని బిగ్ బీ చెప్పాడు.

    స్వచ్ఛంద కార్యక్రమాల్లో బిగ్ బీ అమితాబ్

    స్వచ్ఛంద కార్యక్రమాల్లో బిగ్ బీ అమితాబ్

    అంలేకాకుండా, అమితాబ్ మరో విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టారు. బాలికలను వేశ్యవృత్తిలోకి వెళ్లకుండా కాపాడే ఓ స్వచ్ఛంద సంస్థకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతిలో పాల్గొన్న అజిత్ సింగ్, సర్బానీ దాస్ రాయ్‌తో కలిసి కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టనున్నట్టు బిగ్ బీ తెలిపారు.

    English summary
    Bollywood icon Amitabh Bachchan says over 850 farmers from Uttar Pradesh have been identified, and their loans to the tune of Rs 5.5 crore will be taken care of. "A list of over 850 farmers from Uttar Pradesh have been identified and their loans amounting to over 5.5 crore shall be taken care of.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X