»   » క్రిష్ 3 : అమితాబ్ వాయిస్ ఓవర్

క్రిష్ 3 : అమితాబ్ వాయిస్ ఓవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : హృతిక్ రోషన్ హీరోగా రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్రిష్ 3'. హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగు ద్వారా వెల్లడించారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన వాయిస్ ఓవర్ ఉంటుందని, బాగా పాపులర్ అయిన అమితాబ్ వాయిస్ అయితేనే ఆయా సీన్లకు సరిగ్గా సరిపోతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

క్రిష్-3 ఫస్ట్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెల 5న విడుదలైన ట్రైలర్ పది రోజుల్లో 1 కోటి 20 లక్షలకు పైగా హిట్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ చాలా బాగుందనే టాక్ రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన లుక్ పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేసారు. మెటల్‌తో తయారు చేయడంతో దాని బరువు 28 కేజీలకు చేరిందట. సినిమాలో తన పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్న వివేక్ ఆ బరువును లెక్కచేయకుండా ఇష్టపడి ఆ పాత్రలో అద్భుతంగా నటించాడట.

గతంలో రూపొందిన రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. క్రిష్-3 చిత్రంలో హృతిక్ రోషన్ సూపర్ మేన్ పాత్రలో కనిపించబోతునప్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈచిత్రం విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టం అవుతోంది. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
"Up at 7 a.m. to reach for a dub for 'Krissh 3'... Rakesh Roshan, father to Hrithik and the director and producer of eminence, asked me to do a voiceover for his film... I agreed and that was done," the 70-year-old posted on his blog srbachchan.tumblr.com in the wee hours of Saturday morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu