Just In
Don't Miss!
- News
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు : విజయవాడ నుంచి 15 మంది గ్యాంగ్.. ప్లాన్ అమలుచేసింది అతనే..
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి కన్ఫ్యూజన్ లో పడిన అఖిల్.. హిట్ కొట్టాలంటే అగ్ర హీరోలను ఎదుర్కోవాల్సిందేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ యుద్ధాలు ఈ సారి గట్టిగానే జరగనున్నట్లు అర్ధమయ్యింది. ఎవరు కూడా అంత ఈజీగా వెనుకడుగు వేయడం లేదు. వీలైనంత వరకు హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు హాలిడేస్ ను టార్గెట్ చేస్తే కొన్ని సినిమాలపై ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇక అఖిల్ కొత్త సినిమాపై కూడా ఆ ప్రభావం పడే ఛాన్స్ లేకపోలేదు.
అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే భారిగానే ఉన్నాయి. అయితే సినిమాను సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఏప్రిల్ లో లేదా మే మొదటి వారంలో రావచ్చని తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో 16వ తేదీన టక్ జగదీష్ రానున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

అయితే అదే నెలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక మెగాస్టార్ ఆచార్య కూడా ఏప్రిల్ ఏండింగ్ లో లేదా మే మొదటివారంలోనే రావచ్చని అంటున్నారు. సినిమా సినిమాకు రెండు వారాల గ్యాప్ ఉండకపోతే కలెక్షన్స్ నిలదొక్కుకోవడం కష్టమే. మరి అఖిల్ బాబు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెద్ద సినిమాలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.