Don't Miss!
- News
మొఘల్ గార్డెన్స్ ఇక పై ‘అమృత్ ఉద్యాన్’: 31 నుంచి ప్రజలకు అనుమతి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
షర్ట్ విప్పేసి అలా.. జాలీమూడ్‌లో అభిజిత్.. మాల్దీవుల్లో రచ్చ
బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్న ర్ అభిజిత్‌కు ఇప్పుడున్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్‌లో టాస్కులు ఆడకపోయినా కూడా జనాల మనసు మాత్రం గెలిచేశాడు. ఇంట్లో ఒక్కసారి కూడా కెప్టెన్ కాకుండానే బిగ్ బాస్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. అయితే బిగ్ బాస్ అంటే ఆటలు కాదని, వ్యక్తిత్వమని మరోసారి అభిజిత్ నిరూపించాడు. అలా అభిజిత్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.

స్పెషల్ కంటెస్టెంట్..
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో చివరకు అభిజిత్ స్పెషల్ కంటెస్టెంట్ అయిపోయాడు. అతని వ్యక్తిత్వం, ప్రవర్తన, మాట్లాడే తీరు, నడుచుకునే విధానం ఇలా అన్నింటికి ప్రేక్షకులు ముగ్దులైపోయారు. ఎంతో పరిణతి చెందిన వ్యక్తి.. నీ లాంటి కంటెస్టెంట్ ఉండటంతో తనకు ఎంతో గర్వ కారణం అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.

అలా ఫోకస్..
హీరోగా అభిజిత్ నిలదొక్కుకునేందుకు చాలానే కష్టపడుతున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, పెళ్లి గోల తప్పా అభిజిత్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేవు. అయితే బిగ్ బాస్ వల్ల ఇమేజ్‌ను వాడి ఓ మంచి హిట్ కొట్టేయాలని చూస్తున్నాడు. దాని కోసమేనిత్యం స్క్రిప్ట్‌లు వింటూ ఉన్నాడు.

అలా ప్రకటన..
త్వరలోనే అప్డేట్ ఇస్తున్నాను అంటూ అభిజిత్ ఓ పోస్ట్ చేశాడు. అయితే సినిమాలను అనౌన్స్ చేస్తాడని అంతా భావించారు. కానీ నిర్మాణ సంస్థను ప్రకటించారు. సోబర్ ట్రూత్ అంటూ పులి లోగోను విడుదల చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థలోనే చిత్రాలను చేయబోతోన్నట్టు కనిపిస్తోంది.

అవే ఇష్టం..
మామూలుగానే అభిజిత్‌కు ట్రావెలింగ్ అంటే ఇష్టం. దూరప్రయాణాలు చేయడం, బీచ్‌లు, పర్వతాలు, రైడింగ్, స్పోర్ట్స్ అంటే మహా ఇష్టం. ప్రస్తుతం అభిజిత్ మాల్దీవుల్లో సేద తీరుతున్నాడు. అక్కడే కొన్ని రోజులు వెకేషన్‌ను ఎంజాయ్ చేయనున్నాడు.

మొదటిసారిగా అలా..
మామూలుగా అభిజిత్ తన దేహాన్ని ప్రదర్శించుకోడు. బిగ్ బాస్ ఇంట్లో ఏనాడూ కూడా షర్ట్ విప్పినట్టు కనిపించలేదు. అయితే అభిజిత్ ఆ మధ్య సిక్స్ ప్యాక్ కోసం విపరీతంగా కష్టాలు పడ్డాడట. ఇప్పుడు మొదటిసారిగా ఇలా షర్ట్ విప్పేసి దర్శనమిచ్చాడు. ఇక అభిజిత్ ఫిట్ నెస్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. తన సినిమాల కోసం రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.