twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు వేరే పనిలేదు.. పిల్లల్ని వేధిస్తే సంగతి తేలుస్తా.. స్కూల్ యాజమాన్యాలకు శివబాలాజీ హెచ్చరిక

    |

    సినీ నటుడు, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 విజేత శివబాలాజీ మరోసారి స్కూల్ యాజమాన్యాలపై మండిపడ్డారు. ఫీజుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధించడం ఎంత వరకు సమంజసం అంటూ నిలదీశారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు సమావేశంలో శివబాలాజీ భగ్గుమన్నారు. ఆయన మాట్లాడుతూ..

     పిల్లల్ని వేధించడంపై శివబాలాజీ ఆవేదన

    పిల్లల్ని వేధించడంపై శివబాలాజీ ఆవేదన

    ఇటీవల శివ బాలాజీ దంపతులకు ఓ స్కూల్ మేనేజ్‌మెంట్‌తో చేదు అనుభవం ఎదురైంది. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్న ఓ స్కూల్స్ ఫీజు చెల్లింపు పేరుతో వేధించారు. తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాస్ కనెక్షన్ కట్ చేయడాన్ని శివ బాలాజీ తీవ్రంగా పరిగణించారు. దాంతో వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యాశాఖలో ఫిర్యాదు చేయడం వివాదంగా మారింది.

     లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి సమస్యనా?

    లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి సమస్యనా?

    పలు స్కూల్స్ యాజమాన్యం తీరుపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఫీజుల చెల్లింపు గురించి ఇలా మాట్లాడే పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదు. ఇక్కడ ఉన్న వాళ్లందరూ తల్లిదండ్రులే. అందుకే ఈ సమస్యతో ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగాలు పోయి, వ్యాపారాలు దెబ్బతిని, ఉద్యోగులు సగం జీతానికి పనిచేస్తున్న సమయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల విషయంలో వేధించడం సమంజసం కాదు అని శివబాలాజీ అన్నారు.

     డబ్బు గుంజే పని ఎంత వరకు సమంజసం

    డబ్బు గుంజే పని ఎంత వరకు సమంజసం

    లాక్‌డౌన్ సమయాన్ని పట్టించుకోకుండా గతేడాదికి ఈ ఏడాదికి ఫీజుల్లో మార్పుల్లేకుండా తల్లిదండ్రుల నుంచి డబ్బు గుంజే కార్యక్రమం ఎంత వరకు సమంజసం. లాక్‌డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులకు లోనవుతున్న సమయంలో పాఠశాల యాజమాన్యాలు ఇలా వ్యవహరించడం సరికాదు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ వారిని టార్గెట్ చేస్తున్నారు అని శివబాలాజీ పేర్కొన్నారు.

     ఫిర్యాదు తర్వాత తీరు మారింది

    ఫిర్యాదు తర్వాత తీరు మారింది

    మా పిల్లలు చదువుకొనే స్కూల్‌పై ఫిర్యాదు చేసిన తర్వాత పాఠశాల యాజమాన్యాల తీరు మారింది. ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చారు. పుస్తకాలు తీసుకెళ్లమని ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇలాంటి మార్పు అన్ని స్కూల్స్‌లో కనిపిస్తున్నది. ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడటం వల్లనే, మన హక్కులు గురించి చెప్పడం వల్లనే ఇది సాధ్యపడింది. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, ఆరోగ్యం విషయంలో ఇలాంటి సమస్యలను ఎందుకు ఎదుర్కొవాలి అని శివబాలాజీ ఎమోషనల్ అయ్యారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4: Noel sean Demands Sorry From Bigg Boss
    పిల్లల్ని వేధిస్తే మీ పని పడుతా

    పిల్లల్ని వేధిస్తే మీ పని పడుతా

    స్కూల్ పిల్లల విషయంలో ఇబ్బందిపడే ప్రతీ పేరెంట్స్‌ను సపోర్ట్ చేయబోతున్నాను. రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులకు నా మద్దతు ఉంటుంది. ఈ విషయంలో బహిరంగంగా చెబుతున్నాను. నాకు పనిలేదు. ఇక ముందు నాకు ఇదే పని. ఏదైనా సమస్య వస్తే మీ స్కూల్ ముందు వచ్చి నిలుచుంటాను. ఏ స్కూల్ విద్యార్థి గానీ, ఏ తల్లిదండ్రికి గానీ సమస్య ఎదురైతే.. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మీ సంగతి తెలుస్తా అని శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు.

    English summary
    Bigg Boss contestant Siva Balaji warns School managements over Fee collection in Lockdown. Earlier, He made a complaint on Private School on fee collections in lockdown. He files complaint with Telangana State Education Department over fee collection amid government order which not to collect fees from parents.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X