Just In
Don't Miss!
- News
గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాధాన్యం..
- Sports
India vs England: స్టోక్స్, ఆర్చర్ ఆగయా.. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ ఇదే!
- Finance
హైదరాబాద్ సహా సిటీల్లో హౌసింగ్ సేల్స్ జంప్, పూర్తి ఏడాది పరంగా డౌన్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొన్న విజయ్ దేవరకొండ.. నేడు శేఖర్ కమ్ముల.. అభిజిత్ జోరు మామూలుగా లేదు
బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ రచ్చ మామూలుగా ఉండటం లేదు. తనకు ఇంతటి స్థానాన్ని ఇచ్చిన జనాలకు, మద్దతు తెలిపిన ప్రేక్షకులకు, సెలెబ్రిటీలకు అభిజిత్ థ్యాంక్యూ చెబుతూ బిజీగా ఉన్నాడు. తనకు సపోర్ట్ చేస్తూ గెలిపించిన సెలెబ్రిటీలను, తన స్నేహితులను పర్సనల్‌గా కలుస్తూ.. స్పెషల్‌గా థ్యాంక్స్ చెబుతున్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, వెంకీ కుడుముల, నాగబాబు వంటి వారిని కలుస్తూ వస్తున్నాడు.

ఒక్కొక్కరిని..
బిగ్ బాస్ షో నుంచి విజేతగా బయటకు వచ్చిన అభిజిత్.. ప్రేక్షకుల అభిమానాన్ని చూసి ఎమోషనల్ అయ్యాడు. అలా తనకు ఇంత మద్దతు ఇచ్చిన వారికి సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పేందుకు వారం మొత్తం కేటాయిస్తాను. మొదటి వారిని కలిశాకే తన మిగతా పనులు చేసుకుంటానని అభిజిత్ చెప్పుకొచ్చాడు.

వరుసగా కలుస్తూ..
మెగా బ్రదర్ నాగబాబుకు అభిజిత్ ఎంతలా మద్దతిచ్చాడో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నాగబాబును కలిసి కాసేపు ముచ్చటించాడు. అభిజిత్ లాంటి వారిని ఇండస్ట్రీ గుర్తించాలని, అవకాశాలు ఇవ్వాలని నాగబాబు కోరాడు. అభిజిత్ నాగబాబు కలిసి బిగ్ బాస్ ఇంటి విషయాలను చర్చించుకున్నారు.

వెంకీ కుడుములతోనూ..
యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతోనూ అభిజిత్ కలిసి రచ్చ చేశాడు. అయితే ఈ ఇద్దరూ గతంలో మంచి స్నేహితులను ఇలా చాలా రోజుల తరువాత కలవడంతో అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ అభిజిత్ చెప్పుకొచ్చాడు.

ఆ గ్యాంగ్‌తో..
అభిజిత్ అంటే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరో అనే అందరికీ తెలుసు. ఇన్నాళ్లకు అభిజిత్‌కు తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. అలా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటీనటులందరితో అభిజిత్ కలిసి రచ్చ చేశాడు. ఇందులో విజయ్ దేవరకొండ, సుధాకర్ కొమాకుల బాగా రచ్చ చేశారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల..
అయితే అభిజిత్ ఇక్కడి వరకు వచ్చాడంటే అది శేఖర్ కమ్ముల ఇచ్చిన అవకాశం వల్లే. సింప్లిసిటీ, హ్యుమిలీటి, రెస్పెక్ట్.. సినిమాలకంటే ఎక్కువగా నేర్పారు.. థ్యాంక్స్.. మీ శీను.. అంటూ అభిజిత్ శేఖర్ కమ్ముల గురించి చెప్పుకొచ్చాడు.