Just In
- 3 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 27 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Finance
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీఎం జగన్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు: వాడి తల కావాలంటూ దారుణంగా!
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు సీనియర్ నటి కరాటే కల్యాణీ. 'బాబీ' అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్‌ను అందుకున్న ఆమె.. వరుసగా సినిమా ఆఫర్లను కూడా ఒడిసిపట్టుకున్నారు. అదే సమయంలో తెలుగు బుల్లితెరపై ప్రసారం అయిన పలు సీరియల్స్‌లోనూ మంచి పాత్రలను పోషించి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్‌లో పాల్గొని వెంటనే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా కరాటే కల్యాణీ ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... సంప్రదాయంగా
వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోన్న కరాటే కల్యాణీ ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగార్జున సారథ్యంలో వచ్చిన ప్రారంభ ఎపిసోడ్‌లో సంప్రదాయమైన వస్త్రాధరణతో హౌస్‌లోకి ప్రవేశించారామె. ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు.

బిగ్ బాస్ షోలో ఆదిలోనే ఎదురుదెబ్బ
బిగ్ బాస్ హౌస్‌లో కొన్ని వివాదాలు.. చిన్న చిన్న గొడవలు పెట్టుకున్న కారణంగా రెండో వారానికి గానూ కరాటే కల్యాణీని నామినేట్ చేశారు తోటి కంటెస్టెంట్లు. ఆ వీక్‌లో తక్కువ ఓట్లు పడడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అదే సమయంలో తనకు వచ్చిన బిగ్ బాంబ్‌ను ప్రయోగించి దేవీ నాగవల్లిని నామినేట్ చేసింది. దీంతో ఆమె కూడా షో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

బయటికొచ్చాక రచ్చ రచ్చ చేసేసిందిగా
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కరాటే కల్యాణీ.. ఎన్నో న్యూస్, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సందర్భంగా ఎన్నో వివాదాస్పద విషయాలను వెల్లడించింది. అదే సమయంలో కొందరు కంటెస్టెంట్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరిగింది.

రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆ పార్టీలో చేరిక
బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకునేందుకు కరాటే కల్యాణీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిందామె. అంతేకాదు, 2024 ఎన్నికల లోపు బలమైన నాయకురాలిగా ఎదిగేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించింది.

సీఎం జగన్‌పై కల్యాణీ సంచలన వ్యాఖ్యలు
విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఉన్న రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో శనివారం రామతీర్థం వెళ్లి నిరసన చేసింది కరాటే కల్యాణీ. ఈ సందర్భంగా ‘రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తుంది. హిందువులను కించపరిచేలా నాయకులే రెచ్చగొడుతున్నారు. అందుకే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి' అంటూ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

వాడి తల కావాలంటూ దారుణంగా
నిరసనలో పాల్గొన్న సమయంలో ‘రామతీర్థం అంటే మాకు భద్రాద్రిలా. నేనిక్కడే హరికథలు చెప్పడం మొదలెట్టా. రాముడికే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ దారుణ ఘటనకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. సీఎం జగన్ స్పందించాలి. వెంటనే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాడి తలను మా దగ్గర పెట్టాలి' అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది కరాటే కల్యాణీ.