ప్రేమ, పెళ్లిపై ప్రశ్నలకు క్రేజీ రియాక్షన్స్.. మొత్తానికి సీక్రెట్స్ బయటపెట్టేసిన రోహిణి!!

బిగ్ బాస్ ఫేమ్ రోహిణి గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సీరియళ్లతో ఎంత కామెడీ పంచిందో.. బిగ్ బాస్ షోలనూ అంతే ఎంటర్టైన్ చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా రోహిణి తన స్టైల్లో సోషల్ మీడియాను ఆడుకోవడం మొదలుపెట్టింది. రోహిణి తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లో ఉంటుంది. ఈవెంట్లు, స్పెషల్ షోలతో ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా రోహిణి మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉంటుంది.

Recommended Video

Abhijeet తో గొడవలు లేవన్న Sohel, MehaBoob చేసిన సైగల పై Sohel కుండబద్దలు !
 తాజాగా ప్రశ్నల వర్షం..

తాజాగా ప్రశ్నల వర్షం..

తాజాగా రోహిణి తన ఫ్యాన్స్‌తో కలిసి కాసేపు ముచ్చటించింది. అభిమానులను క్రేజీ క్వశ్చన్స్ అడగమని సవాల్ విసిరింది. దీంతో ఒక్కొక్కరు తమ క్రియేటివిటీని బయటపెట్టారు. అయితే కొందరు మాత్రం ఎక్కువగా ప్రేమ, పెళ్లి అంశాలపైనే ప్రశ్నలను సంధించారు.

 పెళ్లి ఎప్పుడు?

పెళ్లి ఎప్పుడు?


నెటిజన్లలో చాలా మంది పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్ననే సంధించారు. అయితే ఇలా అడిగిన ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సమాధానం చెప్పింది. పెళ్లి ఎప్పుడు అంటే జరిగినప్పుడు అని, వరుడు దొరికినప్పుడు అని, ఎప్పుడో తెలియదన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం ఇలా రకరకాలుగా స్పందించింది.

లవర్ ఉన్నాడా?

లవర్ ఉన్నాడా?

మీరు సింగిలా? లవర్ ఉన్నాడా? ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? ఎవరినైనా ప్రేమించారా? అని రోహిణిని ప్రశ్నించారు. సింగిల్‌గానే ఉన్నాను.. లవర్ బాయ్ ఫ్రెండ్ లేడు.. ప్రేమలో ఎప్పుడూ పడలేదంటూ సమాధానాలు ఇచ్చింది. ఎవరినైనా ప్రేమించారా? అని అడిగితే మాత్రం అవునని సమాధానం ఇచ్చింది.

 పర్సనల్ సీక్రెట్స్..

పర్సనల్ సీక్రెట్స్..

ఇక రోహిణి ఏజ్, హైట్ వంటి పర్సనల్ విషయాలను కూడా అడిగాడరు. అలాంటి ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చింది. 1993లో పుట్టాను అని చెప్పింది.. ఎత్తు ఎంత అంటే 5"5 అని సమాధానం ఇచ్చింది. బీటెక్ ఏ కాలేజ్.. ఎప్పుడు పాస్ అయ్యారు.. వాట్సప్ డీపీ?.. స్క్రీన్ లాక్ ఏంటి అని రకరకాలుగా అడిగేశారు.

 అషూ కూడా..

అషూ కూడా..

ఇక చివరకు అషూ కూడా పెళ్లి ఎప్పుడు అని అడగడంతో రోహిణికి చిర్రెత్తిపోయింది. రావే నువ్ రావే మనం పెళ్లి చేసుకుందాం.. ప్రతీ ఒక్కరికి నా పెళ్లి గోల అయిందంటూ కామెడీగా కామెంట్ చేసింది. మొత్తానికి రోహిణి మాత్రం తన అభిమానులకు అదిరిపోయే రిప్లైలు ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X