»   » వింతగా ప్రవర్తించాడు.... బిగ్‌బాస్ షోలో దాడి, ఏం జరిగింది?

వింతగా ప్రవర్తించాడు.... బిగ్‌బాస్ షోలో దాడి, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. తెలుగువారు ఇదివరకెప్పుడూ చూడని సరికొత్త రియాల్టీ షో కావడంతో రెస్పాన్స్ బావుంది. షోలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

షో ప్రారంభమైన మూడో రోజు జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బిగ్ బాస్ ఇంటి సభ్యుడైన ఆదర్శ్ తన ప్రవర్తనతో అందరినీ బెంభేలెత్తించాడు. తనను అదుపు చేయడానికి ప్రయత్నించిన వారిపై దాడి చేశాడు.

అలవాటు ఉందా?

అలవాటు ఉందా?

ఆదర్శ్ ప్రవర్తించిన తీరు చూస్తుంటే....అతడికి మత్తు పానీయాల్లాంటి అలవాట్లు ఉన్నాయేమో అనే అనుమానాలు ప్రేక్షకుల నుండి వ్యక్తం అయ్యాయి.

విస్కీ కోసం

విస్కీ కోసం

అలవాటు ఉన్నవాళ్లే.... అది తమకు దొరకని సమయంలో ఇలా ప్రవర్తిస్తుంటారని, చివరకు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి విస్కీ లాంటి మత్తు పానీయాలు కూడా బిగ్ బాస్ ఇంట్లోలో అందుబాటులో లేక పోవడంతో ఆదర్శ్ వింతగా ప్రవర్తించాడని, అందుకే విస్కీ కావాలంటూ అరిచాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Bigg Boss : Jr Ntr Show Facing Problems Due To Mumaith Khan, Watch Here
ధన్ రాజ్ మీద దాడి

ధన్ రాజ్ మీద దాడి

ఆదర్శ్‌ను అదుపు చేయడానికి కమెడియన్ ధనరాజ్ ప్రయత్నించగా.... అతడిపై దాడి చేసి కొరికేశాడు. ఆదర్శ్ గట్టిగా కొరకడంతో ధనరాజ్‌కు రక్తస్రావం జరిగింది.

ఏడ్చేసిన ఆదర్శ్

ఏడ్చేసిన ఆదర్శ్

కొంతసేపటికి తేరుకున్న ఆదర్శ్ తాను ఎందుకు ఇలా చేస్తున్నానో తెలియక తనలో తానే ఏడ్చేశాడు. ధనరాజ్ కు సారీ చెప్పాడు. అనంతరం అతడిని ప్రిన్స్ వేరే రూమ్‍‌కు తీసుకెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు.

మత్తులేక తట్టుకోలేక పోయాడు

మత్తులేక తట్టుకోలేక పోయాడు

కొంత సేపటి తర్వాత రూమ్ నుండి బయటకు వచ్చిన ఆదర్శ్.... వస్తువులను చిందరవందరగా పడేస్తూ హల్ చల్ చేశాడు. అతడి ప్రవర్తనతో ఇతర బిగ్ బాస్ ఇంటి సభ్యులు బెంభేలెత్తి పోయారు.

కాపాడే ప్రయత్నం చేసిన హౌస్ మేట్స్

కాపాడే ప్రయత్నం చేసిన హౌస్ మేట్స్

అయితే బిగ్ ఇంట్లో హింసకు పాల్పడితే అతడిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండటంతో.... అంతా కలిసి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. తనపై దాడి చేసినా ధన్ రాజ్ లైట్ తీసుకున్నాడు. దీన్నంతా కావాలని చేసిన ఫ్రాంక్‌లా క్రియేట్ చేశారు.

జస్ట్ ఫన్ కోసమేనా

జస్ట్ ఫన్ కోసమేనా

చివర్లో ఇదంతా కేవలం ఫన్ కోసం చేసినట్లు సీన్ క్రియేట్ చేశారు. మరి ఆదర్శ్ బిగ్ బాస్ దృష్టిలో ఎక్కువ మార్కులు కొట్టేయడానికి ఇదంతా చేశాడా? లేక నిజంగానే అతడు విస్కీ కోసం అల్లాడి పోయాడా? అనేది తేలాల్సి ఉంది.

English summary
Telugu Bigg Boss housemate Adarsh behaved like an Alcohol addict. Bigg Boss Telugu 1 is the first season of the Telugu reality television series Bigg Boss Telugu. It started broadcasting on 16 July 2017 on Star Maa. The show was hosted by N.T. Rama Rao Jr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu