»   » మసాలా పెంచిన ‘బిగ్ బాస్’ : దారుణంగా ప్రవర్తించిన నవదీప్, దీక్ష!

మసాలా పెంచిన ‘బిగ్ బాస్’ : దారుణంగా ప్రవర్తించిన నవదీప్, దీక్ష!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు 'బిగ్ బాస్' షో రాను రాను ఆసక్తిలేకుండా సాగుతుందనే విమర్శలు రావడం, గత వారం రేటింగ్ కూడా కాస్త తగ్గడంతో షో నిర్వాహకులు రూటు మార్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నవదీప్‌ను రప్పించడంతో పాటు.... లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో మసాలా పెంచారు.

బిగ్ బాస్ స్టార్ హోటల్ పేరుతో ప్రస్తుతం కొత్త టాస్క్ రన్ అవుతోంది. ఇందులో నవదీప్, దీక్ష గెస్టులుగా ఉండాలని, ఇతర బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా హోటల్ సిబ్బందిగా ఉండాలని బిగ్ బాస్ ఆదేశించారు. ప్రిన్స్‌ను హోటల్ మేనేజర్‌గా, కార్తీక, హరితేజలను చెఫ్‌లుగా, ముమైత్ ఖాన్‌ను పర్సనల్ అసిస్టెంటుగా, శివ బాలాజీ, ఆదర్శ్, ధనరాజ్, అర్చన వెయిటర్లుగా నియమించారు.

సీక్రెట్ టాస్క్

సీక్రెట్ టాస్క్

అయితే నవదీప్, దీక్ష పంత్‌లను ప్రత్యేకంగా పిలిచిన బిగ్ బాస్.... హోటల్ సిబ్బంది చిరాకు పడేలా, తాము ఈ పనులు చేయము అనేలా వారిని విసిగించాలంటూ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు.

Bigg Boss Telugu : Diksha Panth tortures Archana
దారుణంగా ప్రవర్తించిన నవదీప్

దారుణంగా ప్రవర్తించిన నవదీప్

హోటల్ సిబ్బందికి విసుగు తెప్పించడంలో భాగంగా నవదీప్ దారుణంగా ప్రవర్తించాడు. అర్చనను పిలిచి కాళ్లకు మసాజ్ చేయించుకున్నాడు. తాను అర్దనగ్నంగా మారుతానని, థాయ్ మసాజ్ చేయాలని డిమాండ్ చేశాడు. తన కాలి బ్రొటన వేలుపై ఉన్న వెంట్రుకలను అర్చన తన పంటితో పీకాలని ఆదేశించాడు.

అలాంటివి కుదరవు

అలాంటివి కుదరవు

అయితే తాను పంటితో మీ కాలి వెంట్రుకలను పీకలేనని అర్చన తేల్చి చెప్పింది. ఇక ధనరాజ్, ఆదర్శ్, శివ బాలాజీలలో ఎవరైనా అర్దనగ్నంగా మారి తనకు సేవలు చేయాలని నవదీప్ కోరగా.... అందుకు తమ హోటల్ రూల్స్ ఒప్పుకోవని మేనేజర్ ప్రిన్స్ తేల్చి చెప్పారు.

నాలుకతో చెవి క్లీనింగ్

నాలుకతో చెవి క్లీనింగ్

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తే తన చెవి నొప్పి పుడుతుందని, అందుకు ఎవరైనా వచ్చి వారి నాలుకతో తన చెవి క్లీన్ చేయాలని నవదీప్ ఆదేశించాడు. ఇలా దారుణమైన కోరికలు కోరుతూ నవదీప్ హోటల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.

మసాజ్ చేయించుకున్న దీక్ష

మసాజ్ చేయించుకున్న దీక్ష

నవదీప్ రేంజిలో కాక పోయినా.... దీక్ష ప్రవర్తన కూడా అదే స్థాయిలో సాగింది. శివ బాలాజీ, ధనరాజ్‌లతో మసాజ్ చేయించుకుంది. వారు ఒంటిపై బట్టలు లేకుండా కేవలం టవల్ మాత్రమే కట్టుకుని తనకు మసాజ్ చేయాలని కోరింది. శివ బాలాజీ, ధనరాజ్ మోకాళ్ల వరకు మసాజ్ చేస్తుంటే..... తన తొడలపై సైతం మసాజ్ చేయాలంటూ వారు ఇబ్బంది పడేలా ప్రవర్తించింది.

వాళ్లని మెప్పిస్తేనే రేటింగ్

వాళ్లని మెప్పిస్తేనే రేటింగ్

అయితే గెస్టులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి సేవలు చేస్తూ, వారు అడిగిన గొంతెమ్మ కోరికలు తీరుస్తూ.... వారు మెప్పు పొంది ఎక్కువ స్టార్ రేటింగ్ సాధిస్తేనే ఇంటి సభ్యులు ఈ టాస్కులో గెలుపొందుతారు.

ఎలిమినేషన్ నుండి సురక్షితులు కావాలంటే

ఎలిమినేషన్ నుండి సురక్షితులు కావాలంటే

వచ్చే వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నుండి సురక్షితులు కావాలంటే..... హోటల్ సిబ్బంది ఇబ్బంది పడేలా తాము ఈ పనులు చేయలేము అనే స్థాయికి వాళ్లను తీసుకెళ్లాలని బిగ్ బాస్ నవదీప్, దీక్షలకు సూచించారు. దీంతో ఎలిమినేషన్ నుండి సురక్షితులు అయ్యేందుకు హోటల్ సిబ్బంది వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

English summary
Bigg Boss house is going to have a new entrant. It is already known that Diksha Panth has entered the house as a wild card entry. This week, the wild card entry is going to be Navadeep. Bigg Boss assigns the contestants to set up a hotel in the house and asks Navdeep and Diksha to be the guests.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu