»   »  రంజుగా సాగుతున్న ‘బిగ్ బాస్’, అందరూ నామినేట్ అయ్యారు!

రంజుగా సాగుతున్న ‘బిగ్ బాస్’, అందరూ నామినేట్ అయ్యారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బాస్ రియాల్టీ షో ఎవరూ ఊహించని విధంగా చాలా రంజుగా సాగుతోంది. గతవారం ప్రేక్షకుల ఊహకు అందని విధంగా కత్తి కార్తీక, ధనరాజ్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే 7వ వారం కూడా ఎలిమినేషన్ల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

సాధారణంగా ప్రతివారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యే వారి సంఖ్య నాలుగుకు మించదు. అయితే ఈ సారి కెప్టెన్ హరితేజ, మీసాలోడు శివ బాలాజీ తప్ప మిగతా సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ఎంపిక ప్రక్రియ కూడా ఈ సారి డిఫరెంటుగా సాగింది.

ఇద్దరి ఏకాభిప్రాయంతో

ఇద్దరి ఏకాభిప్రాయంతో

ఈ సారి ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులను పిలిచిన బిగ్ బాస్..... ఇద్దరూ కలిసి ఏకాభిప్రాయంతో మరో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లను నామినేట్ చేయాలని కోరారు. ఇలా వారు చెప్పిన పేర్ల ప్రకారం నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్, అర్చన, దీక్ష, ముమైత్ నామినేట్ అయ్యాడు.

ఆదర్శ్‌ను కాపాడిన కెప్టెన్

ఆదర్శ్‌ను కాపాడిన కెప్టెన్

అయితే ప్రత్యేక అధికారం ఇచ్చి ఒకరిని కాపాడే అవకాశం ఇవ్వడంతో..... కెప్టెన్ హరితేజ తనకు ఎంతో ఇష్టమైన ఆదర్శ్‌ను ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ నుండి సేవ్ చేసింది.

కోతి, కోతిని ఆడించేవాడు

కోతి, కోతిని ఆడించేవాడు

బిగ్ బాస్ షో వినోదాత్మకంగా సాగేందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వివిధ టాస్క్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోతిలా హరితేజ, కోతిని ఆడించే వాడిలా శివ బాలాజీ ఎంటర్టెన్ చేశారు.

రిక్షా వాలా జిందాబాద్

రిక్షా వాలా జిందాబాద్

ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘రిక్షా వాలా జిందాబాద్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు రిక్షాపై ఆదిలాబాద్, వరంగల్, వైజాగ్, గుంటూరు, కర్నూలు మీదుగా హైదరాబాద్ ప్రయాణించాలి. ఆ ప్రదేశాల్లో స్టే చేసినపుడు అక్కడి సంస్కృతికి అద్దంపట్టే స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయాలి.

వినోదాత్మంగా సాగిన టాస్క్

వినోదాత్మంగా సాగిన టాస్క్

రిక్షా వాలా జిందాబాద్ టాస్క్ ఇంటి సభ్యులు చాలా వినోదాత్మకంగా పూర్తి చేశారు. అదిలాబాద్‌లో గిరిజన తెగల వేషధారణ, నృత్యాలతో అలరించారు. వరంగల్‌లో కాకతీయ సంస్కృతి ప్రతిబింబించేలా రుద్రమదేవి చరిత్రను చెప్పారు. వైజాగ్ లో మత్సకారుల వేషధారణతో స్కిట్, గుంటూరులో మిర్చి ఫ్యాక్టరీ కార్మికుల స్కిట్.... హైదరాబాద్ లో ఇక్కడి సంస్కృతికి అద్దంపట్టే స్కిట్ చేసి అలరించారు.

English summary
Bigg Boss Season 1 Episode 45 details. Culture Fest in The House, In this cultural task, the contestants dress up and dance according to the cities in Andhra Pradesh and Telangana. The housemates complete the task enthusiastically.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu