»   » టిక్కెట్టు డబ్బు వెనక్కి ఇమ్మంది వాళ్ళే

టిక్కెట్టు డబ్బు వెనక్కి ఇమ్మంది వాళ్ళే

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిందాస్' సినిమా రిలీజుకు ముందు సినిమా నచ్చని వారికి టిక్కెట్టు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని అమెరికాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరే టిక్కెట్టు డబ్బులు వెనక్కి అడిగారని నిర్మాత సుంకర అనిల్ కుమార్ మీడియాతో చెప్పారు. నిర్మాత అనీల్ మాట్లాడుతూ...బిందాస్‌ చిత్రం మా అంచనాలను నిజం చేసింది. ప్రేక్షకులందరూ మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఇరవై వేల మందిలో ఇద్దరే ముందుకొచ్చారు. వారిలోనూ ఒకరు నిజంగా డబ్బు ఇస్తామా లేదాని పరీక్షించడానికేనని చెప్పారు. ఇంతటి జనాదరణ పొందుతున్నందుకు సంతోషమనిపిస్తోందని ఆయన అన్నారు. అలాగే సినిమా నిర్మాణం గురించి వివరిస్తూ...ఇప్పుడున్న పరిస్ధుతుల్లో ... చిత్రం తీయడమే కాదు.. విడుదల చేసుకునే శక్తి ఉన్నప్పుడే సినిమా తీయాలన్నది నా సిద్ధాంతం. అలాగే కథ మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్ర నిర్మాణానికి దిగామన్నారు.ఇక ఈ బిందాస్ చిత్రాన్ని మంచు మనోజ్ హీరోగా వీరూపోట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మనోజ్ చిరకాలం తర్వాత వచ్చిన హిట్ గా అంతా అభివర్ణిస్తున్నారు. ఇక నిర్మాత తన తర్వాత చిత్రం గురించి మాట్లాడుతూ... అల్లరి నరేష్‌ కథానాయకుడిగా తదుపరి చిత్రం ఉంటుందని తెలిపారు. శ్రీహరి ఓ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ చిత్రం ద్వారా వీరభద్రం చౌదరి అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తున్నామన్నారు. రఘు కుంచె సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్తుందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X