దాసరి బయోపిక్‌ నిర్మించనున్న ఓ కళ్యాణ్‌

దర్శకరత్న దాసరి నారాయణ రావు బయోపిక్ తెరకెక్కబోతోంది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు ఓ కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

By Bojja Kumar

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు జీవిత కథాంశంతో అతి త్వరలో ఓ చిత్రం రాబోతోంది. నటుడు, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు ఓ కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ విషయమై ఆయన అఫీషియల్ ప్రకటన చేశారు.

కళ్యాణ్ మాట్లాడుతూ.... దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. పుట్టినవారు మరణించక తప్పదు. మరణించిన వారు మళ్లీ జన్మించక మానరు...అన్నట్లుగా దాసరి గారు మళ్ళీ మన మధ్యకి రావాలని కోరుకుంటున్నాను...అన్నారు.

Biopic on Dasari's life in the pipeline

Recommended Video

సినీ కళామతల్లికి దాసరి ముద్దు బిడ్డ. సినీ రంగానికి ఆయన ఒక దిక్సూచి. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన అనంతలోకానికి పయనమైనా..ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉండాలని..దాసరిగారి బయోపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తానని తెలిపారు.

గురువు గారి జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ చిత్రంలో చూపించనున్నాము. దాసరి గారి ప్రియ శిష్యుడైన ఓ దర్శకుడు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టైటిల్‌, ఆర్టిస్ట్‌ల వివరాలు అతి త్వరలో తెలియజేస్తానని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X