»   » బిపాసా బసు జిమ్ వర్కౌట్స్ (వీడియో)

బిపాసా బసు జిమ్ వర్కౌట్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో బిపాసా బసు ఒకరు. 36 ఏళ్ల వయసులోనూ గ్లామర్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అమ్మడికి ఈ వయసులోనూ ఇంత అందంగా, సెక్సీ ఫిగర్ మెయింటేన్ చేయడానికి కారణం ఆమె క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడమే. తాజాగా బిపాసా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

బిపాసా బసుకు సంబంధించిన ఇతర విషయాల్లోకి వెళితే..
ఎలోన్ చిత్రంలో కలిసి నటించిన బిపాసా బసు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరి ఎఫైర్ తారా స్థాయికి చేరిందనే వార్తలు బాలీవుడ్లో గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో వారు అలాంటిదేమీ లేదని ఖండిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వారు మాల్దీవుల్లో కలిసి ఎంజాయ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Bipasha Basu loves 'hanging' from gym bars

మాల్దీవుల్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా బిపాసా, కరణ్ అక్కడ గడపడంతో పాటు ఇద్దరూ సముద్ర తీరంలో బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసారు. బిపాసాతో పాటు డీన్నే పాండే కూడా ఈ ఫోటోల్లో కనిపించారు. ఇద్దరూ కలిసి బికినీలో జలకాలాడుతూ తెగ ఎంజాయ్ చేసారు.

ప్రస్తుతం బిపాసా బసు ‘సింగ్ ఈజ్ బ్లింగ్' అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరే ఇతర సినిమాలు లేవు.

English summary
The Bong bombshell, who's always been a fitness freak, is now indulging in a form of exercise, which involves hanging from gym bars.
Please Wait while comments are loading...