»   » లవ్ స్టోరీల స్పెషలిస్ట్ పుట్టిన రోజు స్పెషల్ (ఫోటో ఫీచర్)

లవ్ స్టోరీల స్పెషలిస్ట్ పుట్టిన రోజు స్పెషల్ (ఫోటో ఫీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : కొన్ని సినిమాలు మనస్సును తాకుతాయి...మరికొన్ని కేవలం శరీరాన్ని స్పందింప చేస్తాయి...అయితే ఎక్కువగా శరీర స్పందనలకే ప్రయారిటీ ఇస్తూ మనకు చిత్రాలు రెడీ అవుతూంటాయి. మనస్సును సైతం స్పందింప చేసే చిత్రాలను అతి కొద్ది మంది మనస్సును అర్దం చేసుకున్న దర్శకులు మాత్రమే తీయగలరు. అందులో ప్రధమ శ్రేణి దర్శకుడు గౌతమ్ మీనన్.

  ఆయన సినిమా అంటేనే ఓ కావ్యం.. అంతా ప్రేమమయం. అది మనసులోని మధురానుభూతులను తట్టిలేపుతుంది. యువతను కన్నార్పకుండా కట్టిపడేస్తుంది. పెద్దవాళ్లనైతే మళ్లీ మదిలో దాగున్న అలనాటి జ్ఞాపకాల్లోకి లాక్కెళ్తుంది. అదే గౌతంమీనన్‌ ప్రత్యేకత. ప్రేమ మనిషిని తాకుతుందా.. మనసును తాకుతుందా.. అంటే ఆయన సినిమా చూస్తే అర్థమవుతుంది!

  ఆ ప్రేమ మధురిమ ఎంతో తెలియాలంటే ఆయన సినిమాల్లోని పాటలు వింటే తెలిసిపోతుంది!! ఖాకీ చొక్కా లోపలున్న కఠినమైన గుండెలో.. ప్రేమ చక్కర్లు కొడుతుందా అంటే.. అందుకూ ఆయన సినిమానే సమాధానం. ప్రేమకు జాతిమత భేదం లేదు.. మరి వయస్సు? అబ్బాయికన్నా.. అమ్మాయి పెద్దదైతే..? ఆ ప్రేమలో నిజమెంత, అందమెంతో వెతకాలన్నా.. గౌతం సృజనాత్మకతను అడగాల్సిందే. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

  స్లైడ్ షోలో ...గౌతమ్ మీనన్ చిత్రాలు గురించి...

  అవును నిజమే...

  అవును నిజమే...

  'పదేపదే ఒకే ప్రశ్న అడక్కండి. నాకు ప్రేమంటే ప్రేమ. అందుకే ఆ తరహా చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తాు'నని సమాధానమిస్తారు గౌతంమీనన్. ప్రేమలేని ప్రకృతి లేదు.. జీవరాశి లేదు. అన్నింటికీ మూలం ప్రేమే! ఆ విషయంలో ఆయన చిత్రాలు పది రెట్లు ఎక్కువగానే ఉంటాయి.

  శైలి లో విభిన్నత...

  శైలి లో విభిన్నత...

  ప్రేమ ఉన్న కథలు, ప్రేమే కథగా మారిన సినిమాలు వెండితెరపై ఎప్పుడూ పలుకరిస్తుంటాయి. కానీ ఆ తరహా చిత్రాలకు ఓ ల్యాండ్‌మార్కు ఎవరంటే టక్కున గౌతం పేరు వినబడటం మాత్రం ఖాయం. ప్రేమ కథలతో ఒకట్రెండు విజయాలను సొంతం చేసుకోవడం సులభమే. ఆ తర్వాత కూడా హిట్‌ను సొంతం చేసుకోవడం కష్టతరమైనా భిన్నశైలితో సుసాధ్యం చేస్తున్నారు గౌతం.. అలియాస్‌ గౌతం వాసుదేవ్‌ మీనన్‌.

  తొలి చిత్రం

  తొలి చిత్రం

  గౌతమ్ మొదటి చిత్రం 'మిన్నలే'. మాధవన్‌, రీమాసేన్‌ జంటగా తెరకెక్కించిన ఈ సినిమాతో తన సత్తా చాటుకున్నారు. ఎలాంటి అంచనాలూ లేకుండానే పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. కథకు సంగీతం ఎంత బలమో కూడా చూపించారు. తన సినిమా అంటే సంగీతానికి పెద్దపీట ఉంటుందని కూడా చెప్పారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ గౌతం ప్రత్యేకతకు అద్దం పడుతుంటాయి.

  పోలీసు ప్రేమ

  పోలీసు ప్రేమ

  పోలీసు అధికారి సినిమాలంటేనే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నేరస్థులను చీల్చి చెండాడేలా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ.. పోలీసు అందంగా, అతడికో ప్రేమ, తీయనైన కుటుంబం.. అంటూ వైవిధ్యమైన కథాంశంతో 'కాక్క కాక్క' (ఘర్షణ) ను తెరకెక్కించారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ఇందులో సూర్య నటించారు. మాస్‌ కన్నా క్లాస్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. అందులో అమ్మాయిలే ఎక్కువని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

  తెలుగులోనూ...

  తెలుగులోనూ...

  బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను రాబట్టిన 'కాక్క కాక్క' సినిమాను తెలుగులో 'ఘర్షణ'గా రీమేక్‌ చేశారు. వెంకటేశ్‌, అసిన్‌ జంటగా నటించారు. అయితే తమిళం స్థాయిలో తెలుగులో ఆదరణ దక్కలేదు. కానీ.. గౌతం స్త్టెలిష్‌ టేకింగ్‌ మాత్రం తెలుగు జనాలను ఆకర్షించింది.

  కమల్ తో ...

  కమల్ తో ...

  కమల్‌హాసన్‌ కూడా పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా మర్చారు ఈ దర్శకుడు. 'వేట్టయాడు విలయాడు'లో కమల్‌ అందంగా కనిపించడంతోపాటు చిన్నపాటి డైలాగులతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ద్వితీయార్థంలో కమల్‌ ప్రేమ సన్నివేశాలు, పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. అలాగే శరత్‌కుమార్‌ను 'పచ్చక్కిలి ముత్తుచ్చరం'లో స్త్టెలిష్‌ పోలీసుగా చూపించారు గౌతం.

  గుండె నిండా ప్రేమ

  గుండె నిండా ప్రేమ

  'వినైతాండి వరువాయా'.. గౌతంమీనన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రం. శింబును ఎవర్‌గ్రీన్‌ స్త్టెలిష్‌ హీరోగా మార్చారు. అమ్మాయి వయస్సు ఎక్కువైనా.. ప్రేమకు పెద్ద పట్టింపు లేదని ప్రస్తావించారు. అమ్మాయికోసం కేరళ వెళ్లడం, కెరీర్‌ను సైతం అమ్మాయి కోసం మార్చుకోవడం, తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలో.. తమ జీవితాన్నే సినిమా తెరకెక్కించి తొలి విజయాన్ని అందుకోవడం వంటి విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్నింటికన్నా ఇందులో ప్రతి సన్నివేశం ఎంతో అందంగా కనిపిస్తుంది.

  నాగచైతన్యతో ..

  నాగచైతన్యతో ..

  'వినైతాండి వరువాయా'.. కథలో క్త్లెమాక్స్‌ కాస్త మార్పు చేసి తెలుగులో 'ఏ మాయ చేశావే'గా అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు గౌతం. నాగచైతన్య, సమంతలకు కెరీర్‌ హిట్‌ను అందించారు. సూర్యతో 'కాక్క కాక్క' హిట్‌ను సొంతం చేసుకున్న గౌతం 'వారనం ఆయిరం' వంటి భిన్నమైన కథను తెరకెక్కించి మరో విజయాన్ని దక్కించుకున్నారు.

  ఎటో వెళ్లిపోయింది మనసు

  ఎటో వెళ్లిపోయింది మనసు

  గౌతం దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం 'నీదానే ఎన్‌ పొన్‌ వసందం'. తమిళంలో జీవా, సమంత.. తెలుగులో (ఎటో వెళ్లిపోయింది మనసు) నాని, సమంత నటించారు. ప్రేమికుల మధ్య చోటుచేసుకునే చిన్న పాటి సమస్యలు, వాగ్వాదాలు, పోటీలోని తీయనైన బాధను అందంగా, ఆత్మీయంగా ఆవిష్కరించారాయన. ప్రేమికులతోపాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు.

  లేటెస్ట్ గా...

  లేటెస్ట్ గా...

  వరుసగా ఐదారు హిట్లను తన ఖాతాలో వేసుకున్న గౌతం.. ఆది నుంచి ఇప్పటి వరకు ప్రేమ సినిమాను మాత్రమే తెరకెక్కించడం విశేషం. అంతేనా.. 'సట్టెండ్రు మారుదు వానిలై' అంటూ మరో ప్రేమకావ్యాన్ని తెరపై రాస్తున్నారు. ఇందులో శింబు హీరో. ఇదికాకుండా తనకెంతో ఇష్టమైన నటుడు అజిత్‌తో కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. మరి ఈ రెండు సినిమాలూ మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తూ.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం.

  English summary
  Turning 40, ace director Gautham Vasudev Menon is celebrating his birthday today. Oneindia telugu team wishes Gautham Vasudev Menon a Happy Birthday and all success in the coming years!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more