»   »  బర్త్ డే కి తనకితానే గిఫ్ట్ ఇచ్చుకొని: రాత్రంతా ఆమెతో అదే కారులో

బర్త్ డే కి తనకితానే గిఫ్ట్ ఇచ్చుకొని: రాత్రంతా ఆమెతో అదే కారులో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ జంట రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొనే జంట కలిసి కనపడకపోవటంపై వారిద్దరూ దూరంగా ఉంటున్నారనే గాసిప్స్ బాలీవుడ్ లో హల్ చల్ చేశాయి. ఈ వదంతులు అబద్ధం అంటూ ఈ జంట నిరూపించింది. అనేక సార్లు వీరిద్ద‌రు జంట‌గా క‌నిపించ‌డంతో త్వ‌ర‌లోనే పెళ్ళి పీట‌లెక్క‌నున్నార‌ని ఫ్యాన్స్ భావించారు. వీటన్నింటిపై కొన్నాళ్లు మౌనంగా ఉన్న రణ్ వీర్ నోరువిప్పాడు. దీపికను తాను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ అనుభవం కొత్తగా ఉందని చెప్పాడు. ఇలాంటి భావన ఇంతకుముందెన్నడూ కలగలేదని చెప్పేసాడు.

రణ్ వీర్ సింగ్ దీపికా

రణ్ వీర్ సింగ్ దీపికా

రణ్ వీర్ సింగ్ దీపికాల కాంబినేషన్ రామ్-లీలా - బాజీరావ్ మస్తానీ సినిమాలు వచ్చాయి. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. ఇదే జంటతో భన్సాలీ ముచ్చటగా మూడో సినిమా పద్మావతి సినిమా తీస్తున్నాడు. ఇదే సమయంలో దీపిక ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టింది.

ఫారిన్ టూర్లు ఎక్కువయ్యాయి

ఫారిన్ టూర్లు ఎక్కువయ్యాయి

అప్పటి నుంచి ఆమెకు ఫారిన్ టూర్లు ఎక్కువయ్యాయి. రణ్ వీర్ కూడా షూటింగుల్లో బాగా బిజీ అయిపోయాడు. దీంతో వీరిద్దరూ కలిసి తిరిగేందుకు కానీ నటించేందుకు కానీ సమయం దొరకడం లేదు. భన్సాలీ పద్మావతి షూటింగ్ షెడ్యూల్స్ కూడా ఇద్దరివీ వేరేవేరుగా ఉన్నాయి. అందుకే ఎప్పుడు కాస్త టైం దొరికినా దాన్ని సద్వినియొగం చేసుకుంటున్నారు.

న్యూ ఆస్టోన్ మార్టిన్ కారు

న్యూ ఆస్టోన్ మార్టిన్ కారు

అయితే ర‌ణ‌వీర్ ఈ రోజు 32వ ప‌డిలోకి అడుగు పెట్ట‌గా నిన్న రాత్రి త‌న బ‌ర్త్ డే వేడుక‌ని సింపుల్ గా జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తుంది. అంతేకాదు బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న‌కి తానుగా బ్రాండ్ న్యూ ఆస్టోన్ మార్టిన్ కారు ని గిఫ్ట్ గా ఇచ్చుకున్నాడు ర‌ణ‌వీర్ . ఈ కాస్ట్ లీ కారులో దీపిక తో ఫ‌స్ట్ రైడ్ చేశాడు.

రిలేష‌న్ స్ట్రాంగ్ గానే ఉంది

రిలేష‌న్ స్ట్రాంగ్ గానే ఉంది

వీరిద్ద‌రు క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్న పిక్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఆ మ‌ధ్య వీరిద్ద‌రు విడిపోయార‌ని ఒక‌రికొక‌రు మొఖం చాటేసుకుంటున్నార‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి, వీరి మ‌ధ్య రిలేష‌న్ స్ట్రాంగ్ గానే ఉంద‌ని ఈ ఫోటోస్ ని బ‌ట్టి తెలుస్తుంది.

ర‌ణవీర్ -దీపిక

ర‌ణవీర్ -దీపిక

ర‌ణవీర్ -దీపిక తొలిసారి 2013లో వ‌చ్చిన గోలియాన్ కి రాస‌లీలా చిత్రంలో క‌లిసి న‌టించ‌గా, ఆ త‌ర్వాత సంజీయ్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన బాజీరావ్ మ‌స్తానీ లో ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇక ఇప్పుడు ప‌ద్మావ‌తి చిత్రంలోను క‌లిసి న‌టిస్తున్నారు.మరి ఈ ప్రేమ ఎప్పుడు పెళ్ళిపీటలెక్కుతుందో చూడాలి.

English summary
The just-turned-32 actor gifted himself a brand new car - Ranveer did not want to settle for anything below an Aston Martin - and to our delight, roped in Deepika Padukone for a first ride
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu