»   » ఇక ఆ హాట్ సింగర్ వయసు 30+ (ఫోటోలు)

ఇక ఆ హాట్ సింగర్ వయసు 30+ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమాలకు పాటలు పాడుతూ స్టార్ సింగర్‌గా బిజీ అయిపోయింది శ్రేయ గోషల్. ఈ సింగింగ్ సెన్నేషన్ తాజాగా 30వ వడిలోకి అడుగు పెట్టింది. నేడు శ్రేయ ఘోషల్ పుట్టినరోజు. సరిగమ అనే సింగింగ్ రియాల్టీ షోలో విజయం సాధించిన తర్వాత బాలీవుడ్లో సింగర్‌గా బిజీ అయిపోయిన శ్రేయ ఘోషల్....అంచలంచెలుగా ఎదుగుతూ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ 'దేవదాస్' చిత్రంతో సినిమా సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రేయ ఘోషల్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండియాలో అత్యంత బిజియెస్ట్ సింగర్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మార్చి 12, 1984న జన్మించని శ్రేయ ఘోషల్....16వ ఏట నుండే సింగర్ కావాలనే లక్ష్యాన్ని నిర్ణయిచుకుని సక్సెస్ అయింది. హిందీ, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, నేపాలీ, ఒరియా, పంజాబీ, తెలుగు, తమిళ బాషల్లో శ్రేయ ఘోషల్ పాటలు పాడారు.

కాగా....'హమ్‌నషీన్' పేరుతో శేయ ఘోషనల్ గజల్స్ ఆల్బం విడుదల చేసారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం మంగళవారం ముంబైలో జరిగింది. ఈ ఆల్బంకు దీపిక్ పండిత్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి పిటి.జస్రాజ్ జీ, సంజయ్ లీలా భన్సాలీ హాజరైనట్లు శ్రేయ ఘోషల్ తెలిపారు. ఇదే కార్యక్రమంలో ఆమె బర్త్ డే కేక్ కట్ చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు, స్లైడ్ షోలో...

శ్రేయ ఘోషల్

శ్రేయ ఘోషల్

‘హమ్‌నషీన్' ఆల్బం విడుదల కార్యక్రమంలో పాట పాడుతున్న శ్రేయ గోషల్.

‘హమ్‌నషీన్' ఆల్బం విడుదల

‘హమ్‌నషీన్' ఆల్బం విడుదల

శ్రేయ ఘోషల్ గజల్ ఆల్బం ‘హమ్‌నషీన్' విడుదల కార్యక్రమానికి సంబంధించిన దృశ్యం.

పిటి.జస్రాజ్ జీ

పిటి.జస్రాజ్ జీ

శ్రేయ ఘోషల్ గజల్ ఆల్బం ‘హమ్‌నషీన్' విడుదల కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూన్న పిటి.జస్రాజ్ జీ.

పిటి.జస్రాజ్ జీతో శ్రేయ ఘోషల్

పిటి.జస్రాజ్ జీతో శ్రేయ ఘోషల్

పిటి.జస్రాజ్ జీతో కలిసి శ్రేయ ఘోల్. ముంబైలో గజల్ ఆల్బం ‘హమ్‌నషీన్' విడుదల కార్యక్రమం జరిగింది.

బర్త్ డే కేక్

బర్త్ డే కేక్

గజల్ ఆల్బం ‘హమ్‌నషీన్' విడుదల కార్యక్రమం తర్వాత బర్త్ డే కేక్ కట్ చేస్తున్న శ్రేయ ఘోషల్

English summary
Hey it's beautiful Bong Singer, Shreya Ghoshal's birthday and the singing sensation has turned 30 today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu