»   » తండ్రి కాన్సర్, తల్లి,చెల్లి అనారోగ్యంతో బెడ్ పై...అయినా సూపర్ స్టార్ గా ఎదిగి శాసిస్తున్నాడు

తండ్రి కాన్సర్, తల్లి,చెల్లి అనారోగ్యంతో బెడ్ పై...అయినా సూపర్ స్టార్ గా ఎదిగి శాసిస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఆయన పేరు చెప్తే వందల కోట్లు వ్యాపారమవుతుంది. ఆయన తెరపై షారుక్‌ కనిపించగానే చప్పట్లు, ఈలలతో థియేటర్లు మార్మోగిపోతాయి. ఆయన సినిమా వస్తోందంటే చేతులు రెండు చాచి ఆయన ఇచ్చే సిగ్నేచర్‌ స్టైల్‌ ఓ ట్రెండ్‌గా నిలిచిపోయింది. ఆయన గురించి పోగ్రాం చేస్తే టీవీల్లో టీఆర్పీ లు ఓ రేంజిలో వస్తాయి. ఆయనే బాలీవుడ్ బాద్‌షా.. కింగ్‌ ఖాన్‌ .. షారూఖ్ ఖాన్ .

కెరీర్‌ ప్రారంభ రోజులో విలన్‌ పాత్రల్లో నటించి బాలీవుడ్‌ కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌గా ఎదిగారు. ప్రపంచ సక్సెస్‌ఫుల్‌ సెలబ్రిటీల్లో ఒకరిగా నిలిచిన షారుక్‌ బుధవారం 51వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఈ స్పెషల్ ఆర్టికల్.

ఇక ఈ పుట్టిన రోజు సందర్భంగా బాద్‌షాకి పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. అంతేకాదు అభిమానులు షారుక్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటి ముందు పెద్ద సంఖ్యలో బారులు తీరినట్లు సమాచారం. ముందు ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన వారిని చూద్దాం..ఆ తర్వాత ఆయన గురించి కొత్త విశేషాలు చదువుదాం.

యే దిల్ మాంగే మోర్

‘హ్యాపీ బర్త్‌డే షారుక్‌ ఖాన్‌! ఏడాది అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా'

గంటల కొద్దీ...


‘ఆయన గంటలకొద్ది మాట్లాడుతున్నా వినగలను. నిజమైన స్ఫూర్తి.. హ్యాపీ బర్త్‌డే షారుక్‌'

పుట్టిన రోజు శుభాకాంక్షలు..

‘హ్యాపీ బర్త్‌డే షారుక్‌'

ఆల్ రౌండర్ వి


‘సూపర్‌ డూపర్‌ హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌'

ఎన్ని జ్ఞాపకాలు, డ్రీమ్స్‌, జోక్స్


‘మిలియన్‌ జ్ఞాపకాలు, 1000 డ్రీమ్స్‌ షేరింగ్‌, 100 జోక్స్‌! స్నేహం వీటన్నింటినీ చేస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు షారుక్‌ ఖాన్‌'

నువ్వు పుట్టావు...ధాంక్ గాడ్


‘జన్మదిన శుభాకంక్షలు షారుక్‌ ఖాన్‌, ధాంక్ గాడ్ నువ్వు పుట్టావు'

ఓన్లీ వన్...ఖాన్


‘హ్యాపీ బర్త్‌డే.. ఒకే ఒక్క కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌'

మోస్ట్ చార్మింగ్ గై


‘అందమైన, కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌ షారుక్‌ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు'

గాడ్ బ్లస్ యూ బ్రో

‘బాలీవుడ్‌ కింగ్‌కు హ్యాపీ బర్త్‌డే.. నా పెద్ద సోదరుడు షారుక్‌ ఖాన్‌..'

ఇన్ని లక్షణాలు ఉన్న


బర్తడే స్పెషల్: షారూఖ్ పర్శనల్ లైఫ్ సీక్రెట్..ఇప్పటిదాకా మీరు విననవి,ఆశ్చర్యపరిచేవి

నీ జీవితంలో ప్రతీ...

బిపాసా బసు పై విధంగా తన పుట్టిన రోజు శుభాకాంక్షలను షారూఖ్ కి తెలియచేసింది

గుడ్ హెల్త్ తో పాటు


మంచి ఆరోగ్యం, సంపద..అన్నీ మీకు లభించాలని కోరుకుంటున్నా షారూఖ్ అన్నారు అభిషేక్

మరిన్ని సక్సెస్ లు


మరిన్ని సక్సెస్ లు నువ్వు చూడాలని , మరింత ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరుకుంటన్నా షారూఖ్

ఫ్యాన్స్ అందరికీ

మా ఫ్యాన్స్ అందరి తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు...షారూఖ్ ..

 అప్పట్లోనే అవార్డ్ లు

అప్పట్లోనే అవార్డ్ లు

షారుక్‌ దిల్లీలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి చదువులో, క్రీడల్లో ఎప్పుడూ ముందే. ఆయన చదివిన సెయింట్‌ కొలంబియా స్కూల్‌ నుంచి ‘స్వోర్డ్‌ ఆఫ్‌ హానర్‌' అవార్డును కూడా అందుకొన్నారు. కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవారు. పైగా అలనాటి నటులైన దిలీప్‌ కుమార్‌, అమితాబ్‌ బచ్చన్‌, ముంతాజ్‌లను ఇమిటేట్‌ చేయడంలో షారుక్‌ దిట్ట.

 శిక్షణ కూడా తీసుకున్నాడు.

శిక్షణ కూడా తీసుకున్నాడు.

హన్స్‌రాజ్‌ కాలేజ్‌ చదివేటప్పుడు కాలేజ్‌కి వెళ్లడం కంటే దిల్లీలోని టీఏజీ(థియేటర్‌ యాక్షన్‌ గ్రూప్‌)లోనే ఎక్కువగా గడిపేవారు. అక్కడి నుంచే భారీ జాన్‌ అనే థియేటర్‌ డైరెక్టర్‌ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు.

 తల్లి,తండ్రి చనిపోవటం..

తల్లి,తండ్రి చనిపోవటం..

1981లో షారుక్‌ తండ్రి మీర్‌ తాజ్‌ మహ్మద్‌ ఖాన్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ తర్వాత 1991లో తల్లి లతీఫ్‌ఫాతిమా మధుమేహంతో తుదిశ్వాస విడిచారు. ఆ బాధతో షారుక్‌ సోదరి షెహనాజ్‌ మంచానపడ్డారు. దాంతో ఓ పక్క నటనలో శిక్షణ తీసుకుంటూనే సోదరిని చూసుకునేవారు.

 విలన్ గా చేస్తూ..

విలన్ గా చేస్తూ..


అప్పటివరకు బుల్లితెరపై నటిస్తూ వచ్చిన షారుక్‌ 1992లో ‘దీవానా' చిత్రంలో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. కెరీర్‌ తొలినాళ్లలో షారుక్‌ విలన్‌ పాత్రల్లోనే ఎక్కువగా నటించారు. అలా వచ్చిన సినిమాలే ‘డర్‌', ‘బాజిగర్‌', ‘అంజామ్‌' చిత్రాలు.

 ఈ సి నిమాతోనే..

ఈ సి నిమాతోనే..

కానీ షారుక్‌ 1995లో పూర్తి తరహా హీరో పాత్రలో నటించిన చిత్రం ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే'. ఈ సినిమాతో షారుక్‌ పాపులారిటీ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. రొమాంటిక్‌ చిత్రాలు చేయాలంటే ఇండస్ట్రీలో వినిపించే మొదటి పేరు షారుక్‌. 20 ఏళ్ల పాటు ఈ చిత్రం ముంబయిలోని మరాఠా మందిర్‌ థియేటర్‌లో ఆడటం విశేషం.

 కమర్షియల్ సినిమాలతో..

కమర్షియల్ సినిమాలతో..

తొలి కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన ‘దిల్‌వాలే...' తర్వాత షారుక్‌ ‘దేవ్‌దాస్‌'లో ప్రేమికుడిగా, ‘స్వదేశ్‌'లో నాసా శాస్త్రవేత్తగా, ‘చక్‌ దే ఇండియా'లో హాకీ కోచ్‌గా, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌'లో మానసిక వికలాంగుడిగా నటించారు.

 నవ్వులు ఎక్సప్రెస్ ఎక్కి..

నవ్వులు ఎక్సప్రెస్ ఎక్కి..

ఇక ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో షారుక్‌ జీవితంలో మరో మైలు రాయిగా చెప్పుకోవాలి. తమిళ భాష రాక అబద్ధపు ప్రేమికుడిగా షారుక్‌ పండించిన హాస్యం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత హిట్‌ జోడీ షారుక్‌, కాజోల్‌లుమరోసారి ‘దిల్‌వాలే' సినిమాలో ప్రేక్షకులను అలరిద్దామనుకుంటే ప్లాపైంది.

 తొలిసారిగా

తొలిసారిగా

ఇక షారుక్‌ తన కెరీర్‌ గ్రాఫ్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఫ్యాన్‌'. ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో ఆడకపోయినా అభిమానులకి ఓ కొత్త షారుక్‌ని పరిచయం చేసింది.

 బ్రాండ్స్ అన్నీ..

బ్రాండ్స్ అన్నీ..

కింగ్‌ఖాన్‌, బాద్‌షా అనే పేర్లే కాకుండా బాలీవుడ్‌ షారుక్‌ని బ్రాండ్‌ ఎస్‌ఆర్‌కే అని పిలుస్తుంటుంది. ఎందుకంటే సినిమాల కంటే ఎక్కువగా షారుక్‌ చేతిలో బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు ఉన్నాయి.

 కో ఓనర్ కూడా

కో ఓనర్ కూడా

షారుక్‌కి ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' పేరిట సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కి షారుక్‌ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. పిల్లల చదువు కోసం షారుక్‌ చేసిన సాయానికి 2011లో యునెస్కో పిరమిడ్‌ కాన్‌మార్ని అవార్డు అందుకొన్నారు.

 తెలివైన వాడు

తెలివైన వాడు


ప్రతిభావంతుల లిస్ట్‌లో షారుక్‌ పేరు ఎప్పుడూ ఉంటుంది. 2008లో అమెరికన్‌ వీక్లీ న్యూస్‌ మ్యాగజైన్‌ ‘న్యూస్‌వీక్‌' ప్రపంచంలోని 50 మంది ప్రతిభా వంతుల్లో ఒకరిగా షారుక్‌ పేరు చేర్చింది.

 మతాంతర వివాహం

మతాంతర వివాహం

ముస్లిం అయిన షారుక్‌.. పంజాబ్‌కి చెందిన హిందువు గౌరీ చిబ్బర్‌ను 1991లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తానో ముస్లిం అయినా గౌరీని హిందువుల సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి ముగ్గురు పిల్లలు. ఆర్యన్‌ ఖాన్‌, సుహానా ఖాన్‌, అబ్రామ్‌ ఖాన్‌.

 అదే పేరు, అదే డైలాగు

అదే పేరు, అదే డైలాగు

షారుక్‌ గురించి చెప్పాలంటే మొదట గుర్తొచ్చే డైలాగ్‌ ‘నామ్‌ తో సునా హోగా'. ఎందుకంటే ఆయన నటించిన ‘దిల్‌ తో పాగల్‌ హై', ‘కుచ్‌కుచ్‌ హోతా హై', ‘కభీ ఖుషి కభీ గమ్‌', ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌' సినిమాల్లో షారుక్‌ పేరు ‘రాహుల్‌'. రాజు బన్‌గయా జెంటిల్‌మెన్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, చల్తేచల్తే, రబ్‌నే బనాది జోడి సినిమాల్లో షారుక్‌ పేరు రాజ్‌. కాబట్టి ఈ రెండు పేర్లు షారుక్‌ చెప్పినప్పుడల్లా నామ్‌ తో సునా హోగా అంటుంటారు.

 పద్మశ్రీతోనూ

పద్మశ్రీతోనూ

షారుక్‌ కెరీర్‌ గ్రాఫ్‌లో 226 అవార్డులకు నామినేట్‌ అయ్యారు. అందులో 207 అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. 2005లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ'తో.. ఫ్రాన్స్‌ ప్రభుత్వం రెండు అవార్డులతో సత్కరించింది.

 ఎందుకు మన్నత్ అంటే..

ఎందుకు మన్నత్ అంటే..

షారుక్‌ నటించిన తొలి చిత్రం ‘దిల్‌ ఆష్‌నా హై'. కానీ ఆ సినిమా రిలీజ్‌ అవకపోవడంతో ‘దీవానా' సినిమానే తన తొలి చిత్రంగా చెప్తుంటారు.
ముంబయిలోని జుహులో షారుక్‌ నివాసం ‘మన్నత్‌' చాలా పాపులర్‌. ఆయనకు ఓ ప్రార్థన గది కావాలన్న ఒక్క కారణంతో ఈ మన్నత్‌ ఇంటిని రూపొందించుకున్నారట. ఇప్పటికీ తాను ఆర్థికంగా కష్టాల్లో ఉంటే దేన్నైనా అమ్ముతాను కానీ ఇంటిని మాత్రం అమ్మను అంటుంటారు.

 షారూఖ్ కి భయం

షారూఖ్ కి భయం

‘దిల్‌వాలే.. లేజాయేంగే' సినిమాని షారుక్‌ స్క్రిప్ట్‌ చూడకుండానే ఒప్పేసుకున్నారు. షారుక్‌కి గుర్రపు స్వారీలంటే భయం. ఐస్‌క్రీంలు అస్సలు తినరు. షారుక్‌ కార్లన్నింటికీ 555 నెంబర్‌ ప్లేట్‌ ఉంటుంది. ఆ నెంబర్‌తో అదృష్టం వరిస్తుందని షారుక్‌ నమ్మకం.

 అయ్యో లేరే అని

అయ్యో లేరే అని


షారుక్‌ సినిమాల్లోకి రాకముందు తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడుతానున్న స్థాయిని చూసి గర్వించడానికి వారు లేరే అని షారుక్‌ బాధపడుతుంటారు. ఈ విషయాన్నీ ఆయన చాలా సార్లు చెప్తూంటారు. నిజంగా ఇది చాలా బాధకరమైన విషయమే కదా

 డాక్టరేట్ కూడా

డాక్టరేట్ కూడా

సాధారణంగా నిశ్చితార్థపు ఉంగరాన్ని ఎడమ చేతికి పెట్టుకుంటారు.కానీ కింగ్‌ఖాన్‌ కుడి చేతికి పెట్టుకుంటారు. ఎడిన్‌బర్గ్‌ యూనివర్శిటీలో ప్రిన్సెన్‌ ఆన్నీ నుంచి షారుక్‌ డాక్టరేట్‌ పొందారు.

 ఈ రెండు సినిమాలే ప్రస్తుతం

ఈ రెండు సినిమాలే ప్రస్తుతం


ప్రస్తుతం కింగ్‌ఖాన్‌ ‘రయీస్‌', ‘డియర్‌ జిందగీ' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ షారుక్‌ని మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలుని తెలుపుతోంది వన్ ఇండియా తెలుగు.

 ఇందులో నిజమెంత

ఇందులో నిజమెంత

షారూఖ్ ఖాన్ కి అయితే చాలా మంది నటీమణులతో ఎఫైర్స్ అంటగట్టేసారు. అక్కడితో ఆగకుండా ఆయన మగవాళ్లతో కూడా తిరుగుతారు , ఎఫైర్ పెట్టుకుంటారు అని గాసిప్స్ ప్రచారం చేసేసారు. నిజానిజాలు ఏమిటి..ఈ విషయంలో ..నిజంగానే షారూఖ్ అలాంటివాడా అంటే షారూఖ్ మాటల్లోనే విందాం.

నిజం ఇదే?: హీరోయిన్స్ తోనూ, ఫారినర్స్ తో , చివరకి మగాళ్ళతోనూ పడుకున్నాడా?

షారూఖ్ నివాసం ఉంటే భవంతి ఫొటోలు

షారూఖ్ నివాసం ఉంటే భవంతి ఫొటోలు

షారూఖ్ భవంతిని లోపలకి వెళ్లి చూసినవారు ఓ అద్బుతమే అంటూంటారు. అయితే కొన్ని ఫేక్ ఫొటోలు సైతం నెట్ లో షారూఖ్ భవంతి అని హల్ చల్ చేసాయి. వాటిని, ఒరిజనల్ ఫొటోలును కూడా మీకు ఇక్కడ అందిస్తున్నాం.

సూపర్ స్టార్ మోజుపడి, కోట్లు పెట్టి కట్టుకున్న ఇంటిపై కేసు,భారీ ఫైన్ (భవంతి ఫొటోలు)

English summary
Bollywood is incomplete without the mention of this man who taught how to romance! Yes, we are talking about Shahrukh Khan. He's someone who has entered every girl's dreams and the boys envy him for that same reason. As the superstar turns a year older today we give 51 reasons why we fell in love with this charming actor..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu