»   » అందాల బొమ్మ.... అదా శర్మ బర్త్ స్పెషల్ (ఫోటో ఫీచర్)

అందాల బొమ్మ.... అదా శర్మ బర్త్ స్పెషల్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ 'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన భామ ఆదా శర్మ. తెలుగులో తొలి చిత్రం 'హార్ట్ ఎటాక్' లో పెర్ఫార్మెన్స్ పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాకు హైలెట్‌గా ఉన్న అంశాల్లో ఆదా శర్మ అందచందాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆమె హాట్ స్టిల్స్ చూసే చాలా మంది కుర్రాళ్లు థియేటర్ల వరకు వెళ్లారంటే విషయం అర్థం చేసుకోవచ్చు.

‘హార్ట్ ఎటాక్' తర్వాత అదా శర్మ తెలుగులో నటించిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ ఆమెను పాత్రను సరిగా చూపించలేని, అందం పరంగా కూడా ఆమెను హైలెట్ చేయలేదనే అభిప్రాయం సైతం వ్యక్తం అయింది. హార్ట్ ఎటాక్ తర్వాత మంచి సినిమా పడి ఉంటే అదా శర్మ రేంజి మరింత పెరిగేది. కానీ అలా జరుగలేదు.

మరో తెలుగు మూవీ ‘గరం'లో ఆమె హీరో ఆదికి జోడీగా నటిస్తోంది. అయితే ఈచిత్రం గత కొంతకాలంగా వార్తల్లో లేదు. ఆర్థిక పరమైన సమస్యలతో షూటింగ్ ఆగినట్లు సమాచారం. ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పాపం అదా... అందం, టాలెంట్ ఉన్నా అందలం ఎక్కడంలో ఇబ్బంది పడుతోంది.

ఈ రోజు అదా శర్మ పుట్టినరోజు. మే 11, 1989లో జన్మించిన అదా శర్మ నేటితో 25వ వసంతంలోకి అడుగు పెడుతోంది. అదా శర్మ సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని విష్ చేద్దాం...

సినీ రంగ ప్రవేశం

సినీ రంగ ప్రవేశం

అమ్మడి వయసు 25 సంవత్సరాలు. 2008లో విక్రమ్ భట్ తెరకెక్కించిన ‘1920' అనే బాలీవుడ్ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

ఆకట్టుకునే అందం

ఆకట్టుకునే అందం

తొలి సినిమాతోనే అందం, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కొంత కాలంగా చదువుపైనే దృష్టి సారించింది.

2011 నుండి మళ్లీ...

2011 నుండి మళ్లీ...

2011లో ‘ఫిర్', 2013లో ‘హమ్ హై రహీ కార్ కె' అనే హిందీ చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ప్లాపు కావడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

కేరళలో జన్మించింది

కేరళలో జన్మించింది

ఆదా శర్మ కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించింది. ఆమె తండ్రి మర్చంట్ నేవీ కెప్టెన్. తల్లి డాన్సర్ కావడంతో ఆదా శర్మ కూడా డాన్స్‌పై మక్కువ పెంచుకుంది.

డాన్సర్, జిమ్నా సిస్ట్

డాన్సర్, జిమ్నా సిస్ట్

గోపీకృష్ణ డాన్స్ అకాడమీ నుండి కథక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డాన్స్ మాత్రమే కాదు...స్కూల్ లెవల్ నుండి ఆమె జిమ్నాసిస్ట్.

సినిమాలు

సినిమాలు

2008లో విక్రమ్ భట్ తెరకెక్కించిన ‘1920' అనే బాలీవుడ్ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. 2011లో ‘ఫిర్', 2013లో ‘హమ్ హై రహీ కార్ కె' అనే హిందీ చిత్రాల్లో నటించింది.

యాడ్ ఫిల్మ్స్

యాడ్ ఫిల్మ్స్

తొలి సినిమాతోనే అందాలతో ఆకట్టుకున్న ఆదా శర్మ....లిమ్కా, నోకియా, ఓలే నేచురల్ వైట్, జోయాలుకాస్ జ్యువెల్లరీ, పారాచూట్ హెయిర్ ఆయిల్ తదితర బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసింది.

హార్ట్ ఎటాక్

హార్ట్ ఎటాక్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా ఆదా శర్మ తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.

బబ్లీ యాక్టింగ్

బబ్లీ యాక్టింగ్

హార్ట్ ఎటాక్ చిత్రంలో అమ్మడు బబ్లీ యాక్టింగుతో ఆకట్టుకుంది. ఆమె అందానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం ఆదా శర్మ తెలుగులో ‘గరం', కన్నడలో ధీర రణ విక్రమ చిత్రంలో నటిస్తోంది.

English summary
Adah Sharma (born 11 May 1989) is a Bollywood actress. Her debut film 1920, directed by Vikram Bhatt, was a box office success for which she garnered favourable reviews for her performance.
Please Wait while comments are loading...