»   » నరేంద్రమోడీ అవతారంలో విద్యాబాలన్, బీజేపీ ఆగ్రహం!

నరేంద్రమోడీ అవతారంలో విద్యాబాలన్, బీజేపీ ఆగ్రహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి విద్యా బాలన్ బీజేపీ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురైంది. తన తాజా సినిమా 'బాబీ జాసోస్' సినిమా ప్రమోషన్లో భాగంగా గుజరాత్‌లోని వడోదర వెళ్లిన ఆమె ప్రధాని నరేంద్ర మోడీ అవతారంలో దర్శనమిచ్చింది. ఓ ఫేమస్ టీ స్టాల్ వద్ద నరేంద్రమోడీని పోలిన వేషంలో కనిపించింది.

దీంతో బీజేపీ పార్టీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. ఇలా చేయడం మోడీ ఇమేజ్ హర్ట్ చేయడమే అంటూ ఆందోళన చేపట్టారు. విద్యా బాలన్ వెంటనే తన ప్రయత్నాన్ని విరమించి ఉండకపోతే ఆమెపై టమోటోలు, కోడిగ్రుడ్లు విసరడానికి కూడా ఆందోళన కారులు వెనకాడేవారు కాదని తెలుస్తోంది.

BJP protests against Vidya Balan trying to be 'Narendra Modi'

విద్యా బాలన్ త్వరలో 'బాబీ జాసోస్' అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో విద్యా బాలన్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం సినిమాలో రకరకాల మారు వేషాలు వేయాల్సి వచ్చింది. అసలు మనం ఆమెను గుర్తించలేనంతగా ఈ మారు వేషాలు ఉండబోతున్నాయి. అందుకే సినిమా ప్రమోషన్లు కూడా మారు వేషాల్లో నిర్వహిస్తోంది.

సినిమా కోసం 122 గెటప్‌లు టెస్ట్ చేసారు. చివరగా 12 బెస్ట్ గెటప్‌లను ఎంపిక చేసారు. వివిధ గెటప్స్ వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉందని, పుచ్చుపళ్లతో ఉన్న జ్యోతిష్యుడి వేషం కూడా తాను వేసానని, డిఫరెంటు లుక్‌తో ఎవరూ గుర్తు పట్టని విధంగా తన మారు వేషాలు ఉన్నాయని విద్యా బాలన్ తెలిపారు. ఈచిత్రానికి సమర్ షేక్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4వ తేదీన సినిమా విడుదల అవుతోంది.

English summary

 Vidya Balan on Friday faced opposition from BJP supporters in Vadodara when she was trying to promote her upcoming movie ‘Bobby Jasoos’ the former Gujarat Chief Minister's avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu