»   » రజినీ ఒక ఫ్రాడ్, ఎన్టీఆర్ ఒక వరస్ట్, చిరంజీవి అసలేం చేసాడు?: నోరు పారేసుకున్న బీజేపీ నేత

రజినీ ఒక ఫ్రాడ్, ఎన్టీఆర్ ఒక వరస్ట్, చిరంజీవి అసలేం చేసాడు?: నోరు పారేసుకున్న బీజేపీ నేత

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ టాపిక్‌పై బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తాజాగా ఓ కామెంట్ చేశారు.పార్లమెంటుసభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి రాజకీయ, సినీ ప్రముఖులపై విరుచుకు పడ్డాడు. అంతే కాదు తెలుగు నటులు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడూ నందమూరి తారక రామారావు ని వరస్ట్ అంటూ, మెగాస్టార్ చిరంజీవి పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు

కొందరు తప్ప, రాజకీయాల్లో చాలామంది సినీనటులు విఫలమయ్యారని అన్నారు. దిగ్గజ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు, మాజీ కేంద్రమంత్రి, టాలీవు డ్ .. మెగా స్టార్ చిరంజీవి పై నా సంచలన వ్యాఖ్యలు చేశారు స్వామి. .రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని సుబ్రమణ్యస్వామి ఓ జోక్‌గా కొట్టిపారేశారు. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. .

రజ‌నీకాంత్ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడు

రజ‌నీకాంత్ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడు

ర‌జ‌నీ నిర‌క్ష‌రాస్యుడ‌ని, అత‌ను రాజ‌కీయాల‌కు అన్‌ఫిట్ అని బీజేపీ ఎంపీ అన్నారు. హీరో ర‌జ‌నీకాంత్ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, అత‌ను రాజ‌కీయాల్లో చేర‌రాదు అని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అన్నారు. రజినీకాంత్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.

ఆర్థిక అవకతవకలు

ఆర్థిక అవకతవకలు

రజినీకాంత్‌ను రాజకీయాల్లోకి రావద్దని సూచించారు. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావాలన్న రజనీ ఆకాంక్షలకు ఆయన పాల్పడిన ఆర్థిక అవకతవకలు అడ్డుపడతాయన్నారు. ఆ వివరాలు బయటకు వస్తే రజినీ రాజకీయాల్లోకి కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

మీరు రాజకీయాల్లోకి రాకండి

మీరు రాజకీయాల్లోకి రాకండి

మీడియా ఎంతో గొప్పగా చెబుతున్న ఆయన ఇమేజ్ పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పారు. 'మీరు రాజకీయాల్లోకి రాకండి' అని రజినీకాంత్‌కు స్వామి హితవు పలికారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని బీజేపీ, రాజకీయాల్లోకి రజినీలాంటి మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల స్వాగతించిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అవకతవకల ఆరోపణలు

అవకతవకల ఆరోపణలు

గతంలోనూ ఆర్థిక అవకతవకల ఆరోపణలతో పలువురు రాజకీయ ప్రముఖులను కోర్టు మెట్లెక్కించిన చరిత్ర స్వామికి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసు స్వామి వేసిన ప్రైవేటు ఫిర్యాదే ఆధారంగానే నడుస్తోంది.

ఎన్ .టీ..ఆర్ మోస్ట్ వరస్ట్

ఎన్ .టీ..ఆర్ మోస్ట్ వరస్ట్

అంతటితో వూరు కోలేదు సుబ్రహ్మణ్యస్వామి.. తెలుగు సినీ హీరో లను కూడా వదిలిపెట్టలేదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నందమూరి తారక రామారావు కూడా రాజకీయాల్లో పూర్తిగా విఫలమయ్యారని సుబ్రమణ్యస్వామి అన్నారు. సినీ పరిశ్రమలోనుంచి వచ్చిన అందరిలోకెల్లా ఎన్టీఆరే చాలా ఘోరంగా విఫలమయ్యారని .. ఎన్ .టీ..ఆర్ మోస్ట్ వరస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..

చిరంజీవిని వదల్లేదు

చిరంజీవిని వదల్లేదు

అటు చిరంజీవిని వదల్లేదు, యూపీఏ ప్రభుత్వం(2009-14)లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లో అత్యంత ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. అంతేగాక, చిరంజీవి కేంద్రమంత్రిగా బాధ్యతలైతే చేపట్టారు గానీ.. ఆయన ఏం చేశారో తనతోపాటు ఎవరికీ తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుబ్రమణ్యస్వామి

నిర్ణ‌యం తీసుకోలేద‌ు

నిర్ణ‌యం తీసుకోలేద‌ు

త‌మిళ త‌లైవా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌న్న అంశం ఉత్కంఠ రేపుతున్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాలా లేదా అన్న అంశంపై నేత‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు ర‌జ‌నీ శుక్ర‌వార‌మే వెల్ల‌డించారు. కానీ ఆ అంశంపై పూర్తి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు.

ప్ర‌వేశించే సంద‌ర్భం వ‌స్తే

ప్ర‌వేశించే సంద‌ర్భం వ‌స్తే

తాను రాజ‌కీయాల్లో ప్ర‌వేశించే సంద‌ర్భం వ‌స్తే, ఆ విష‌యాన్ని మీకు ముందుగానే వెల్ల‌డిస్తాన‌ని ర‌జ‌నీ మీడియాతో అన్నారు. రాజ‌కీయ అంశంపై చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌డం లేద‌న్న అంశాన్ని కొట్టిపారేయ‌డం లేద‌ని, రాజ‌కీయ ప్ర‌వేశంపై చ‌ర్చిస్తున్నాన‌ని, కానీ ఇంత వ‌ర‌కు తాను ఎటువంటి నిర్ణ‌యాన్ని తీసుకోలేదు అని త‌లైవా తెలిపారు.

English summary
BJP leader Subramanian Swamy today attacked superstar Rajinikanth over reports of his joining politics - this is a long-standing demand of his fans and many politicians from all parties have approached him in this regard from time to time to join them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more