»   » సినిమాకు టైటిల్ వివాదం...రాజకీయ రంగు

సినిమాకు టైటిల్ వివాదం...రాజకీయ రంగు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: ఏదోక వివాదం చేస్తేనో సినిమాకు పబ్లిసిటీ వస్తోంది. అందులో బాగంగా ఏదో కాంట్రావర్శి టైటిల్ పెట్టడం దాన్ని మర్చమని ఓ వర్గం వివాదం చేయటం,మీడియాలో ప్రీ పబ్లిసిటి ఇదంతా మామూలే. అయితే టైటిల్ మార్చమనే వివాదాలు ఒక్కోసారి పొలిటకల్ రంగు పులుముకుంటాయి. సినిమా వాళ్లు మొదట దీన్ని పబ్లిసిటీకి వాడుకున్నా తర్వాత తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా వేశ్యావృత్తి కథాంశంగా రొపొందించే చిత్రానికి 'కామాటిపుర' పేరు పెట్టడాన్ని స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

  ఆ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం వేశ్యావృత్తి కొనసాగినా ప్రస్తుతం దాదాపుగా తగ్గుముఖం పట్టిందని, ఈ చిత్రానికి ఈ పేరు పెడితే భావితరాలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని, వెంటనే ఆ పేరు మార్చాలని శివసేన నేత అమిత్‌ పాతాడే డిమాండు చేశారు. కామాటిపురలో వేశ్యావృత్తి సాగించేవారు కాకుండా సామాన్య ప్రజలు, విద్యావంతులు, రాజకీయ నేతలు ఎందరో నివాసముంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరారు. కేవలం 2-4శాతం మంది మాత్రమే వేశ్యలు ఉంటారని, కామాటిపుర పేరు వినగానే మరో అభిప్రాయానికి రాకుండా ఉండేందుకు తామంతా కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నామన్నారు.

  BJP-Sena want film to drop Kamathipura title

  ఈ తరుణంలో వేశ్యవృత్తిపై నిర్మించిన చిత్రానికి కామాటిపుర పేరుతో మళ్లీ పాతకథే పునరావృతమౌతుందని నేతలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో తమ పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని, తాము నివాసముండే ప్రాంతం పేరును నలుగురికి చెప్పాలంటే వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇందులో భాగంగానే శివసేన స్థానిక నేతలు కామాటిపుర పేరును తొలగించాల్సిందిగా డిమాండు చేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయగా, భాజపా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా శివసేన అమిత్‌ పాండే.. చిత్ర దర్శకుడు అంకుశ్‌ భట్‌ను సంప్రదించారు. చిత్రానికి పేరు తొలగిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మాజీ కార్పొరేటర్‌ సురేష్‌ కాలే, దిలీప్‌ తమ్మల్‌, నలవడే, మహిళా శాఖ నేతలు పేర్కొన్నారు.

  English summary
  A movie about prostitution titled Kamathipura has got the Shiv Sena and BJP up in arms. However, their problem with the feature film is not the content but its name. Leaders of the two parties say that residents approached them, demanding that the name be changed, as they are fed up of the stigma that comes with living in Kamathipura, Mumbai’s red light district.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more