twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ నమో మంత్ర: పవన్‌‌తో పాటు ఎవరెవరు?(ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇపుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా నరేంద్రమోడీ మంత్రమే. కాబోయే దేశ ప్రధాని ఆయనే అనే నినాదం సర్వత్రా వినిపిస్తోంది. ఎక్కడ ఎవరిని కదిలించినా....మెజారిటీ పీపుల్ నుండి నమో (నరేంద్ర మోడీ) మంత్రమే వినిపిస్తోంది. ఆశ్చర్యకరంగా పలువురు సినీ తారలు కూడా నమో మంత్రం జపిస్తున్నారు.

    ఇన్నాళ్లు మోడీపై ఉన్న అభిమానాన్ని మనసులోనే దాచుకున్న పలువురు సినీ స్టార్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నమో మంత్రం జపిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులు కలలో కూడా ఊహించని విధంగా కొత్త పార్టీ స్థాపించడంతో పాటు, బిజేపీ టర్న్ తీసుకుని మోడీతో చేతులు కలిపి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

    పవన్ కళ్యాణ్‌తో మొదలైన ఈ తంతు...నాగార్జున రాకతో మరింత బలం పుంజుకుంది. వీరితో పాటు మరికొందరు స్టార్స్ కూడా బీజేపీలోకి వెళ్లడానికి ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నరేంద్రమోడీని కలిసారు. ఆయనకు తన మద్దతు ప్రకటించారు. మెడీ ప్రధాని అయితే దేశ ప్రజలకు మంచి జరుగుతుందని మీడియా ముఖంగా చెప్పారు.

    నాగార్జున

    నాగార్జున

    తాజాగా ఈ రోజు టాలీవుడ్ అగ్ర నటుడు నాగార్జున కూడా నరేంద్ర మోడీని కలిసారు. నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

    మోహన్ బాబు

    మోహన్ బాబు

    ఆ మధ్య నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినపుడు మోహన్ బాబు స్వయంగా వెళ్లి మోడీని కలిసారు. దీంతో మోహన్ బాబు కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం ఎక్కడా ఈ విషయం వెల్లడించలేదు.

    బ్రహ్మానందం కూడా....

    బ్రహ్మానందం కూడా....

    టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం కూడా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని, పవన్ కళ్యాణ్ కు చాలా సన్నిహితంగా ఉండే బ్రహ్మీ ఈ మేరకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

    మంచు లక్ష్మి

    మంచు లక్ష్మి

    మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా నరేంద్ర మోడీపై మంచి అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఆమె పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది.

    జీవిత రాజశేఖర్

    జీవిత రాజశేఖర్

    గతంలో ఇతర పార్టీల్లో ఉన్న తెలుగు నటులు జీవిత, రాజశేఖర్ ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

    కృష్ణం రాజు మళ్లీ

    కృష్ణం రాజు మళ్లీ

    గతంలో భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసిన నటుడు కృష్ణం రాజు ఈ సారి కూడా నరేంద్రమోడీ నాయకత్వానికి మద్దతుగా ఉంటారని తెలుస్తోంది.

    నమో మంత్రం

    నమో మంత్రం

    ఇప్పటికే బీజేపీ తరుపున ఇతర రాష్ట్రాల్లో చాలా మంది బాలీవుడ్ నటులు ప్రచారం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా తారలను బీజేపీ తరుపున ప్రచారంలోకి దింపితే మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి బీజేపీ టర్న్ తీసుకోవడం వల్ల ఇతర స్టార్స్ కూడా రియలైజ్ అయ్యారని, దేశానికి మోడీ లాంటి వారి నాయకత్వం అవసరమనే నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది. చాలా రోజుల క్రితమే సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

    English summary
    BJP special focus on film stars in 2014 elections. Pawan Kalyan, Nagarjuna, Jeevitha Rajashekar, Krishnam Raju, Mohan Babu decided to support to Narendra Modi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X