»   » కంగనా రనౌత్ క్షుద్రపూజలు చేసేది : మాజీ ప్రేమికుడి సంచలన వ్యాఖ్యలు

కంగనా రనౌత్ క్షుద్రపూజలు చేసేది : మాజీ ప్రేమికుడి సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెరీర్ లో ఎదగటానికి క్షుద్రపూజలు చేయటం,చేతబడి లాంటి మూఢ నమ్మకాలతో ముడిపడ్డ ప్రయోగాలు చేయటం ఇన్నాళ్ళూ చదువుకోని వాళ్ళు,మారుమూల పల్లె జనాలూ మాత్రమే నమ్ముతారు అనుకోవటం సరి కాదేమో..! ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన ఎదుగుదల కోసం ఇంట్లోనే క్షుద్ర పూజలు చేస్తుందట.

ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ కంగనా మాజీ బాయ్ ఫ్రెండ్ అధ్యయన్‌ సుమన్‌. ఇప్పటికే హీరో హృతిక్ రోషన్‌తో ఆమె గొడవ రోజూ మీడియాలో రచ్చ చేస్తుండగా తాజాగా మీడియా ముందు వెల్లడించిన విశయాలు సంచలనం రేపుతున్నాయి.
2008లో 'రాజ్‌: ద మిస్టరీ కంటిన్యూస్‌' సినిమా సమయంలో సుమన్‌, కంగన ఏడాది పాటు డేటింగ్ చేశారు. కంగన మాజీ లవర్‌ ఆదిత్య పంచోలీ సూచనలు పెడచెవిన పెట్టి తాను కంగనాను ప్రేమించానని, కానీ ఒక రోజు తను ఇంటికి పిలిచి క్షుద్రపూజల్లో పాల్గొనేలా చేసిందని సుమన్ చెప్పాడు.

Black Magic, Physical Abuse: Kangana’s Ex Adhyayan Suman Makes Shady, Shocking Revelation

"ఒకరోజు తను అర్జెంట్ గా ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్ళాను. తన అపార్ట్‌మెంట్‌లో ఆమెకు ఒక చిన్న గెస్ట్‌ రూమ్ ఉంది. ఆ గది పూర్తిగా నల్లరంగుతో ఉంటుంది. కర్టెన్లు కూడా నల్లరంగులోనే ఉంటాయి. అక్కడ కొన్ని దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. వాటిచుట్టూ మంటలు ఎగుస్తున్నాయి. పూజలో కొన్ని భయంకరమైనవి చేసింది. నేను చాలా భయపడిపోయాను. నేనేమీ చేయలేకపోయాను. వెంటనే బయటకు వచ్చి చేసిన పూజ చాలు అని చెప్పాను. ఓ రోజు రాత్రి 12 గంటలకు శ్మశానానికి వెళ్లాల్సిందిగా నన్ను కోరింది. నేను వణికిపోయాను. ఇక ఎప్పుడు అక్కడికి వెళ్లలేదు" అంటూ సుమన్ కంగన క్షుద్రపూజల విశయాన్ని చెప్పుకొచ్చాడు..

తాజాగా డీఎన్‌ఏ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విశయాలు చెబుతూ. తనమీద కూడా కంగనా తన క్షుద్ర ప్రయోగాలు చేసి ఉంటుందనీ చెప్పాడు. 'రాజ్‌ 2' సినిమా తర్వాత తన కెరీర్‌ పూర్తిగా పతనమవ్వగా, అదే సమయంలో కంగన సినిమాలు మాత్రం విజయవంతమయ్యాయని, వాటి గురించి మాట్లాడలంటేనే తనకు భయం అవుతున్నదని అతను చెప్పుకొచ్చాడు....

English summary
Kangana's ex-boyfriend Adhyayan Suman says she was doing black magic on him
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X