Just In
- 20 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 40 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 52 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జస్ట్ ఎక్సపెరిమెంట్...: రామ్ (వెరైటి లుక్ ఫోటో)
హైదరాబాద్ : యంగ్ హీరో రామ్ తన లుక్ ని మార్చటమో లేక మరోటో ఏదో ఒకటి చేస్తూ ఉషారుగా ఉంటూంటాడు. తాజాగా తను జుట్టుని బ్లాండ్లీ లుక్ తో డిజైన్ చేయించుని ట్విట్టర్ లో పెట్టాడు. ఇక ప్రస్తుతం వెంకటేష్, రామ్ హీరోలుగా బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి రీమేక్‌గా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంజలి, షాజన్ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
ఈ చిత్రానికి 'మసాలా' అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈచిత్రం ఆడియో ఆగస్టు 23న అని నిర్ణయించారు. అయితే అనుకోకుండా ఏర్పడ్డ సమస్యల వల్ల ఆడియో విడుదల తేదీ వాయిదా పడిందని, త్వరలో ఆడియో డేట్ ప్రకటిస్తామని ఈ చిత్ర హీరో రామ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ సినిమాలపై తన మనోగతం గురించి వెల్లడిస్తూ 'నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని చెపుతున్నారు రామ్.
సోలోగా సినిమాలు చేయడం వల్ల అంతగా కలిసి రాక పోవడంతో మల్టీ స్టారర్ సినిమాలపై దృష్టి సారించిన వెంకటేష్....అలాంటి స్క్రిప్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందీలో రూపొందిన 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. 'మసాలా' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రలో వెంకీ కనిపించనున్నారు.