»   »  నా భర్త అసహజ శృంగారం కోరుతున్నాడు: బాలీవుడ్ ట్రాన్స్ జెండర్ నటి ఫిర్యాదు

నా భర్త అసహజ శృంగారం కోరుతున్నాడు: బాలీవుడ్ ట్రాన్స్ జెండర్ నటి ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Julie 2 Teaser Trailer : Raai Laxmi, Ravi Kishen

బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన, హిందీ సీరియళ్లలో కూడా నటించే నటి. తన భర్తపై గృహ‌హింస‌ ఫిర్యాదును చేసింది. ఈ ట్రాన్స్ జెండర్ నటి ఈ ఫిర్యాదుతో వార్తల్లోకి వచ్చింది. జెండర్ ట్రాన్స్‌ఫార్మేషన్ తో బాబీ డార్లింగ్ కొన్నాళ్ల కింద పాకీ శర్మగా తన పేరును కూడా మార్చుకుంది. ప్రేమించి పెళ్లాడింది. అయితే ఇప్పుడు తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త రామ్మీన్‌ శర్మ నుంచి విడాకుల కోరుతూ కోర్టును ఆశ్రయించింది. భర్త తనను హింసిస్తుండటమే కాకుండా.. అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది. 'మద్యం సేవించి వచ్చి రామ్నీక్‌ నన్ను కొట్టేవాడు. ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని నన్ను తిట్టేవాడు' అని ఆమె తెలిపింది. తన ఆస్తులన్నింటినీ తన పేరిట రాయించుకొని తనను వేధిస్తున్నాడని, తన వద్ద ఇప్పుడు ఏమాత్రం డబ్బు లేదని ఆమె మీడియాకు తెలిపింది.

Bobby Darling files a police complaint against husband

'ముంబైలోని నా ఫ్లాట్‌కు సహ యజమానిగా తన పేరు రాయించుకున్నాడు. భోపాల్‌లో పెంట్‌హౌస్‌ కొన్నప్పుడు కూడా ఇదేవిధంగా వ్యవహరించాడు. పెళ్లి అయిన వెంటనే నా డబ్బుతో ఎస్‌యూవీ కొన్నాడు. ఇప్పుడు నా వద్ద ఏమీ లేవు' అని ఆమె పేర్కొంది.

తన ప్రతి కదలికను తెలుసుకొనేందుకు డబ్బులు చెల్లించి మరీ రామ్నీక్‌ ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడని, తనను నిత్యం అనుమానిస్తూ వెంటాడుతూ ఉన్నాడని తెలిపారు. అంతేకాకుండా పరస్పర సమ్మతితో విడాకులు తీసుకోవాలని తాను సూచించినా వినకుండా వేధిస్తున్నాడని తెలిపింది. భర్త నుంచి తన ఆస్తి తనకు ఇప్పిస్తే.. వాటన్నింటినీ అమ్మేసి తిరిగి ముంబైకి వచ్చి నివసిస్తానని ఆమె తెలిపింది.

English summary
Bobby Darling files a police complaint against husband for domestic violence and demanding dowry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu