»   » టుబుకు చేదు అనుభవం.. వేధించిన అభిమాని అరెస్ట్

టుబుకు చేదు అనుభవం.. వేధించిన అభిమాని అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి టబుకు చేదు అనుభవం ఎదురైంది. 1998లో కృష్ణ జింకను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌తోపాటు టబూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కోర్టు టబు, సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రేలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టబూ కోర్టు విచారణకు బుధవారం హాజరయ్యారు.

కోర్టులో విచారణ ముగిసిన అనంతరం టబు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోన్నారు. ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని మరీ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. టబుతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆ వ్యక్తిని బౌన్సర్లు లాగిపడేశారు. అభిమాని నిర్వాకానికి టబు చాలా ఇబ్బంది పడ్డట్టు సమాచారం. టబుతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసు కేసు పెట్టే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.

Bollywood Actress Tabu Harassed at Jodhpur Airport

1998లో వచ్చిన 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, టబు కూడా ఉండటంతో కోర్టు వారికి కూడా సమన్లు జారీ చేసింది. ఈ కేసు విషయంలో కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది.

English summary
A Jodhpur court will pronounce its verdict in the 1998 black buck poaching case for which the final arguments were completed in the trial court on March 28, after which Chief Judicial Magistrate Dev Kumar Khatri had reserved the judgment. Bollywood actor Tabu, who has flown to Jodhpur on Wednesday morning for the 19-year-old case linked with the poaching of two blackbucks, reportedly faced eve-teasing while exiting the airport. According to a reports, a fan forcibly made his way into the security guards' circle and misbehaved with the actor. The bouncers, however, immediately pushed him back, steering him clear off Tabu's way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X