»   » ఆ టాప్ దర్శకుడికి జైలు తప్పదా?

ఆ టాప్ దర్శకుడికి జైలు తప్పదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్య కశ్యప్ త్వరలో జైలు ఊచలు లెక్కపెట్టబోతున్నాడా? అంటే అవుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. ఆయన ప్రభుత్వానికి కట్టాల్సిన సర్వీస్ టక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 'బాంబే వెల్వెట్' షూటింగులో భాగంగా శ్రీలంకలో ఉన్న ఆయన సెప్టెంబర్ 3న ముంబై చేరుకోనున్నారు.

ఇప్పటిక సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ముంబైలోని యారీ రోడ్‌లో ఆయన ఆఫీసులో తనిఖీలు చేసారు. బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం ఆయన రూ. 55 లక్షల మేర సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టినట్లు వార్లు వినిపిస్తున్నాయి.

Anurag Kashyap

ఇప్పటికే ఆయన్ను సర్వీస్ టాక్స్ డిపార్టెమెంటు అధికారులు తమ మందు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు. అయితే ఆయన హాజరు కాకుండా, బదులుగా తన ప్రతినిధులను పంపీ ఈ మ్యాటర్‌ను డీల్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆయన అకౌంట్ సీజ్ చేయడానికి అధికారులు ప్రయత్నించగా...సెప్టెంబర్ 3 వరకు గడువు ఇవ్వాలని అనురాగ్ కశ్యప్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అనురాగ్ కశ్యప్ మీద కేసు బుక్ చేసామని, విచారణ జరుపుతున్నామని సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమీషనర్ సమీర్ వాంఖడే కూడా ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా వచ్చాక కస్టడీలోకి తీసుకుంటారనే వార్తలు బాలీవుడ్లో చర్చనీయాంశం అయ్యాయి.

English summary

 Bollywood director Anurag Kashyap in trouble over service tax evasion. Deputy Commissioner of Service Tax Department, Sameer Wankhede also revealed that a case has been booked against Anurag and they are investigating further into this matter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu