»   »  మా ఆయనొస్తున్నాడు: పార్టీ ఇవ్వబోతున్న ప్రీతి జింతా

మా ఆయనొస్తున్నాడు: పార్టీ ఇవ్వబోతున్న ప్రీతి జింతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్న జరిగిన ఐపీఎల్ టోర్నీ లో భాగంగా షారూఖ్ ఖాన్ నైట్ రైడర్స్ ప్రీతీ జింతా జట్టు కింగ్స్ ఎలెవన్ కీ జర్క్ ఇచ్చి మ్యాచ్ ని ఎగరేసుకు పోయింది. పాపం ఈ మ్యాచ్ ఫలితం తో కాస్త డిసప్పాయింట్ అయ్యిందట ప్రీతి. మ్యాచ్ అంతా షారూఖ్ కొడుకు అబ్రాం చిలిపి చేష్టలతోనే నిండిపోయింది. పాపం ప్రీతి మాత్రం మ్యాచ్ పోయినందుకు భాదపడుతూ..,కాస్త ఇబ్బంది గానే ఫీలయ్యింది.

అయితే ఇప్పుడామె భాద పోగొట్టటానికి ఆమె భర్త జీనీ గుడెనఫ్ అమెరికా నుంచి రానున్నాడట. విచారం లో మునిగిపోయిన ప్రీతి కి సర్ప్రైజ్ గా తానే యూఎస్ నుంచి బయల్దేరి వస్తున్నాడు గుడెనఫ్.

బాలీవుడ్ న్యూస్ ప్రకారం నిన్న సాయంత్రమే యూఎస్ నుంచి బయల్దేరిన జీనీ తన 20 గంటల ప్రయాణం తర్వాత ఈ రోజు సాయంత్రం కల్లా ముంబై చేరుకుంటాడట. అసలే నిన్న రాత్రి మ్యాచ్ ఓడిపోయిన భాదలో ఉన్న ప్రీతి జీనీ రాకతో ఖచ్చితంగా సంతోష పడుతుంది. ఓటమి భాదనుఇంచి బయటికి రావటానికి ఆమెకి ఇప్పుడు జానె రాక ఒక రిలీఫ్ అనే చెప్పుకోవాలి...

నిజానికి ఈ జంట తమ పెళ్ళి వ్యవహారమంతా ప్రైవేట్ గానే కానిచ్చారు. లాస్ ఏంజెల్స్ లోనే కొందరు సన్నిహిత కుటుంబాలతో మాత్రమే పెళ్ళి వేడుకలని కానిచ్చేసారు. అందుకే ఇప్పుడు ఈ జంట ముంబై లో మిత్రులకు కూడా పార్టీ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. అందులో భాగం గానే ఇప్పుడు జీనీ రాక అన్నమాట.

ఈ కొత్త జంట ఇంకో రెండు వారాల పాటు ఐపీఎల్ పూర్తయ్యే దాకా ఇండియాలోనే ఉండితమ పెళ్ళి విందు ఏర్పాట్లు కూడా చేసుకుంటారట. బాలీవుడ్ లోని ప్రముఖుల వెసులుబాటుని బట్టి. పార్టీ డేట్ ఫిక్స్ చేస్తారట.

మొదటి సినిమా దిల్ సే

మొదటి సినిమా దిల్ సే

మణిరత్నం దిల్ సే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ సొట్ట బుగ్గల సుందరి. తొలి సినిమా కే బెస్ట్ ఉత్తమ సహాయ నటి గా ఫిలిం ఫేర్ అవార్డ్ తీసుకుంది..

క్రిమినల్ సైకాలజీ పట్టభద్రురాలు

క్రిమినల్ సైకాలజీ పట్టభద్రురాలు

హిమా చల్ ప్రదేశ్ కి చెందిన ఈ సిమ్లా యాపిల్ క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ పట్టాకూడా పుచ్చుకుంది.

తెలుగులోనూ సినిమాలు చేసింది

తెలుగులోనూ సినిమాలు చేసింది

బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించేసిన ప్రీతీ తెలుగు, పంజాబీల్లోనూ నటించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ తోనూ,మహేష్ బాబు తోనూ సినిమాలు చేసింది.

ఫిలింఫేర్ అవార్డ్

ఫిలింఫేర్ అవార్డ్

ఇంట్లో చిన్న తనం నుంచీ నాన్న కూచిగా పేరు తెచ్చుకున్న ప్రీతీ... షారూఖ్ ఖాన్ తో చేసిన కల్ హో న హో తో హీరోయిన్ గా మొదటి ఫిలిం ఫేర్ అవార్డ్ నీ సొంతం చేసుకుంది.కోయీ మిల్ గయా ఆమెకి మంచి పేరు తెచ్చిన సినిమా.

ఇంటర్నేషనల్ సినిమా

ఇంటర్నేషనల్ సినిమా

కెనెడియన్ సినిమా "హెవెన్ ఆన్ ఎర్త్" తో ఇంటర్నేషనల్ సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ భామ ఆ సినిమాకి గానూ ఉత్తమ నటిగా చికాగో ఫిలిం ఫెస్టివల్ లో "సిల్వర్ హ్యూగో అవార్ద్" అందుకుంది.

సినిమాలు మాత్రమే కాదు

సినిమాలు మాత్రమే కాదు

సినిమా యాక్టింగ్ ఒక్కటే కాదు., ఆన్లైన్ సౌత్ ఆసియా బీబీసీ లో కొంత కాలం పాటు కాలమిస్ట్ గా కూడా చేసింది. టెలివిజన్ ప్రజెంటర్ గానూ, సామాజిక కార్యక్రమాలూ, స్టేజ్ ఆర్టిస్ట్ గానూ చేసింది ప్రీతి.

ఐపీఎల్ లోనూ

ఐపీఎల్ లోనూ

తన మాజీ బాయ్ ఫ్రెండ్ నెస్వాడియాతో కలిసి ఐపీఎల్ లో కింగ్స్-ఎలెవన్ జట్టు కి యజమానురాలిగా మారింది. తరువాత ఇద్దరి మధ్యా విబేదాలు రావటం,కోర్టులదాకా వెళ్ళాల్సి రావటం దాకా వెళ్ళిన ప్రీతి నెస్ వాడియాతో తెగదెంపులు చేసుకొని. తన జట్టుని తానే సొంతం చేసుకుంది.

బ్రేవ్ లేడీ ప్రీతీ

బ్రేవ్ లేడీ ప్రీతీ

2003 లో భరత్ షా కేసులో బాలీవుడ్ అంతా నోరు మెదపకుండా ఉన్నప్పుడు. ఇండియన్ మాఫియా కి వ్యతిరేకంగా కోర్టులో ధైర్యంగా తన స్టేట్ మెంట్ ఇచ్చింది ప్రీతీజింతా... ఇందుకు గానూ గాడ్ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రేవరీ అవార్డ్ కూడా అందుకుంది..

సింపుల్ అండ్ సీక్రేట్ మ్యారేజ్

సింపుల్ అండ్ సీక్రేట్ మ్యారేజ్

కెరీర్లోనూ,జీవితం లోనూ ఎక్కడా ఓటమిని ఒప్పుకోని ప్రీతి. పెళ్ళి నిర్ణయం కూడా సరైన సమయం లోనే తీసుకుంది తన చిన్న నాటి స్నేహితుడే అయిన అమెరికా ఆర్ధిక అనాలిస్ట్ జీని గుడెనఫ్ ని పెళ్ళి చేసుకుంది. లాస్ ఏజెల్స్ లో చాలా సింపుల్ గా సీక్రేట్ గా వీళ్ళ పెళ్ళి జరిగింది....

పెళ్ళి తర్వాత

పెళ్ళి తర్వాత

తాజాగా మహారాష్ట్ర లోని నీటికరవు ప్రాంతాలకి సహాయం చేయటానికి, తన పెళ్ళి ఫొటోల ఆల్బం ని వేలం వేసిన ప్రీతీ జింతా... త్వరలోనే తన భర్తతో కలిసి బాలీవుడ్ ప్రముఖులకి గ్రాండ్ గా పార్టీ ఇవ్వనుంది. తొలిసారి ఈ దంపతులిద్దరూ కలిసి కనిపించనున్నారు. ఈ పార్టీ కోసం జీన్ కూడా ముంబై బయల్దేరాడట...

English summary
Preity Zinta anD har husbenD planned to throw a wedding bash in Mumbai to celebrate the joy with friends from the Bollywood industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu