»   » తాప్సీ..! ఇంకా నోటి దూల తగ్గలేదా???: బాలీవుడ్ హీరోలు నన్ను గుర్తించటం లేదంటూ కామెంట్స్

తాప్సీ..! ఇంకా నోటి దూల తగ్గలేదా???: బాలీవుడ్ హీరోలు నన్ను గుర్తించటం లేదంటూ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tapsee Comments On Bollywood Film Makers And Heros తాప్సీ..! నువ్వు ఇక మారావా ?

తాప్సీకి అందమున్నంత బుర్ర ఉండదు అని గతం లో వచ్చిన విమర్శలని నిజం చేయాలనుకుంటుందో ఏమో గానీ తాప్సీ ఈ మధ్య అనవసరంగా నోరుపారేసుకొని భాలీవుద్ కి కూడా దూరమయ్యేలాగా ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుద్ కి వెళ్ళి అక్కడ నాలుగు ఆఫర్లు రాగానే తెలుగు సినిమా ఇందస్ట్రీ మీద నోరుపారేసుకుంది కాక, అదే మత్తులో దర్శకేద్రుడు రాఘవేంద్ర రావు మీద కూడా సెటైర్లు వేసింది.

అలా నోటికొచ్చినట్టు మాట్లాడే దక్షిణాదిన పూర్తిగా అవకాశాలను పోగొట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌ మీద కూడా అలాగే అవాకులు చవాకులు పేలుతోందట! తనకు స్టార్‌ హీరోయిన్‌తో సమానమైన రేంజ్‌ ఉన్నా పెద్ద హీరోలెవరూ గుర్తించడం లేదు అంటూ ఓ బాంబు పేల్చింది. తనని గుర్తించడం లేదు అని బాధపడితే ఎవరూ తప్పు పట్టరు కానీ, తనకి తాను స్టార్‌ హీరోయిన్‌ బిరుదు ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు బాలీవుడ్‌ జనాలు.

Bollywood peaople slam Taapsee for Tapsee Comments on Bollywood film makers, and heros

బాలీవుడ్‌లో ఏ గ్రేడ్‌ హీరోయిన్లతో పోల్చుకున్నా తాప్సీ రేంజ్‌ తక్కువే! అక్కడ ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువ. ఆ సినిమాలు హిట్‌ అయ్యాయి అంటే అదేమీ ఆమె ప్రతిభాపాటవాలతో కాదు అన్న సంగతి తాప్సీకి తెలిసినా, ఆ విజయాలన్నీ తన గొప్పతనమే అన్నట్టు మాట్లాడుతోంది అంటూ కొందరు బాలీవుడ్‌ పెద్దలు ఆమె మీద కారాలు మిరియాలు నూరుతున్నారట! తాప్సీ తన పద్దతి మార్చుకోకుంటే బాలీవుడ్‌ నుంచి కూడా తట్టాబుట్టా సర్దుకోవలసి ఉంటుంది అని అంటున్నారు.

English summary
Bollywood peaople slam Taapsee for Tapsee Comments on Bollywood film makers, and heros
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X