»   »  వారు సూపర్ స్టార్లు...వారసులు ప్లాపు స్టార్లు (ఫోటో ఫీచర్)

వారు సూపర్ స్టార్లు...వారసులు ప్లాపు స్టార్లు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డబ్బు, హోదా, పలుకుబడి, సుఖవంతమైన జీవితం....ఉండే ఏ రంగంలో అయినా వారుసుల జోరు కోనసాగడం సహజమే. ఇలాంటి రంగాల్లో ముఖ్యమైనవి రాజకీయ, సినీ రంగాలు. సినిమా రంగంలో వారసుల జోరు చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. అయితే వారసత్వం అనేది కేవలం ప్లాట్ ఫాం దొరకడానికి మాత్రమే...టాలెంటు, లక్కు ఉంటేనే ఈ రంగంలో నిలదొక్కుకోవడం సాధ్యమని అనేక సందర్భాల్లో రుజువైంది. అందుకు పలువురు స్టార్ హీరోల వారసులే నిదర్శనం.

సూపర్ స్టార్ల కడుపున పుట్టి....సునాయాసంగా సినిమా అవకాశాలు దక్కించున్న పలువురు వారసులు తమ టాలెంటును నిరూపించుకోవడంలో విఫలం అయ్యారు. అలాంటి వారికి సంబంధించిన వివరాలు ఈ రోజు స్లైడ్ షోలో చూద్దాం....

అమితాబ్ బచ్చన్-అభిషేక్ బచ్చన్

అమితాబ్ బచ్చన్-అభిషేక్ బచ్చన్

బాలీవుడ్లో మెగా స్టార్‌గా చక్రం తిప్పిన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఒకానొక సమయంలో ఆయన ఇండస్ట్రీ టాప్ హీరోగా వెలుగొందారు. అయితే అమితాబ్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన అభిషేక్ బచ్చన్ మాత్రం తండ్రికి తగిన తనయుడు అనిపించుకోలేక పోయాడు. స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యాడు.

మిథున్ చక్రవర్తి, మెమోహ్ చక్రవర్తి

మిథున్ చక్రవర్తి, మెమోహ్ చక్రవర్తి

బాలీవుడ్లో సక్సెస్ అయిన నిన్నటి తరం ప్రముఖ నటుల్లో మిథున్ చక్రవర్తి ఒకరు. అయితే ఆయన వారసుడిగా 2008లో ‘జిమ్మీ' అనే చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన మెమోహ్ చక్రవర్తి మాత్రం తండ్రి పేరును నొలబెట్టలేక పోయాడు.

ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్

ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్

బాలీవుడ్ నిన్నటితరం నటుల్లో ప్రముఖుడైన ఫిరోజ్ ఖాన్ నట వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఫర్దీన్ ఖాన్ మాత్రం బాలీవుడ్లో స్టాండ్ కాలేక పోయాడు. వరుస ప్లాపులతో తెరమరుగైపోయాడు.

షర్మిలా ఠాగూర్-సోహా అలీ ఖాన్

షర్మిలా ఠాగూర్-సోహా అలీ ఖాన్

నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో షర్మిలా ఠాగూర్ ఒకరు. ఆమె నట వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోహా అలీ ఖాన్ మాత్రం సక్సెస్ కాలేక పోయింది.

తనుజా-తానిషా

తనుజా-తానిషా

బాలీవుడ్ ఫెయిల్యూర్ హీరోయిన్లలో తానిషా ఒకరు. నిన్నటి తరం నటి తనూజా ఆమె తల్లి, నూతన్ ఆమె ఆంటీ, సక్సెస్ ఫుల్ హీరోయిన్ కాజోల్ ఆమె సోదరి. అయితే వీరి మాదిరి స్టార్ హోదా మాత్రం తానిషా సొంతం చేసుకోలేక పోయింది.

మున్ మున్ సేన్-రియా సేన్

మున్ మున్ సేన్-రియా సేన్

పాతతరం స్టార్ హీరోయిన్ సుచిత్రా సేన్ నట వారసురాలిగా తెరంగ్రేటం చేసిన మున్ మున్ సేన్ తల్లి పేరును నిలబెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే మున్ మున్ సేన్ కూతురు రియా సేన్ మాత్రం అమ్మ‌మ్మ, అమ్మ మాదిరి స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకోలేక పోయింది.

అమ్జద్ ఖాన్-షాదాబ్ ఖాన్

అమ్జద్ ఖాన్-షాదాబ్ ఖాన్

‘షోలే' చిత్రంలో గబ్బర్ సింగ్ పాత్ర పోషించిన అమ్జద్ ఖాన్ అప్పట్లో నటుడిగా తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అమ్జద్ ఖాన్ నట వారసుడిగా తెరంగ్రేటం చేసిన షాదాబ్ ఖాన్ మాత్రం తండ్రి పేరు నిలబెట్టడంలో విఫలం అయ్యాడు.

హేమా మాలిని-ఇషా డియోల్

హేమా మాలిని-ఇషా డియోల్

నిన్నటి తరం హీరోయిన్లలో ‘డ్రీమ్ గర్ల్'గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ‘హేమా మాలిని'. అయితే ఆమె వారసురాలిగా తెరంట్రేటం చేసిన ఇషా డియోల్ మాత్రం తల్లి పేరు నిలబెట్టలేక పోయింది.

శతృఘ్న సిన్హా-లవ్ సిన్హా

శతృఘ్న సిన్హా-లవ్ సిన్హా

బాలీవుడ్ ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా వారుసుడిగా తెరంగ్రేటం చేసిన లవ్ సిన్హా బాలీవుడ్లో ఎక్కువ కాలం నిలవలేక పోయాడు. అయితే శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసి విజయ పథంలో దూసుకెలుతోంది.

వినోద్ ఖన్నా-రాహుల్ ఖన్నా

వినోద్ ఖన్నా-రాహుల్ ఖన్నా

బాలీవుడ్ ప్రముఖ నటుల్లో ఒకరు వినోద్ ఖాన్నా. ఆయన వారసుడిగా తెరంగ్రేటం చేసిన రాహుల్ ఖన్నా మాత్రం బాలీవుడ్లో నిలదొక్కుకోలేక పోయాడు.

English summary
The glamorous world of Bollywood has been producing several superstars since decades and many of them still enjoy their stardom. However, there are many kids with the superstar-wala surnames in the industry as well who miserably flopped in their endeavour to make a mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu