»   » మాహిష్మతిలో 2BHK ఫ్లాట్ కావాలి, బ్రోకర్లున్నారా? : ఈ ట్వీట్ ఇప్పుడు పిచ్చ పాపులర్

మాహిష్మతిలో 2BHK ఫ్లాట్ కావాలి, బ్రోకర్లున్నారా? : ఈ ట్వీట్ ఇప్పుడు పిచ్చ పాపులర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అత్యద్బుతమైన టెక్నికల్ నాలెడ్జ్ ని ఉపయోగించి సినిమాను తెరకెక్కించి, హిట్ కొట్డడంలో దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి పండిపోయారు. ఆ మధ్యన వచ్చిన ఈగ, రీసెంట్ గా వచ్చిన 'బాహుబలి' తెలుగు సినీ చరిత్రలో అద్భుత విజువల్‌ వండర్‌గా నిలిచిపోయాయి.

మాహిష్మతి రాజ్యం

మాహిష్మతి రాజ్యం

హాలీవుడ్ లో 'అవతార్‌' కోసం జేమ్స్‌ కామెరాన్‌ ‌ పాండోరా గ్రహాన్ని సృష్టిస్తే.. ' బాహుబలి' కోసం డైరెక్టర్ రాజమౌళి మాహిష్మతి రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. ఆయన సృష్టించిన 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని వర్చువల్‌ రియాల్టీ(వీఆర్‌)లో చూసిన సినీ లవర్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది.


ఆన్‌సెట్స్‌ ఆఫ్‌ బాహుబలి

ఆన్‌సెట్స్‌ ఆఫ్‌ బాహుబలి

ఇటీవల ఆన్‌సెట్స్‌ ఆఫ్‌ బాహుబలి పేరుతో ఈ సామ్రాజ్యాన్ని చూసే సౌకర్యాన్ని కల్పించాడు జక్కన్న. విజువ‌ల్స్ చూస్తే ప్రేక్ష‌కుల‌కు క‌లిగిన అనుభూతి అలాంటిలాంటిది కాదు. ఆ రాజ్యంలో మ‌న‌మూ ఉంటే బాగుంటుంద‌న్న భావ‌న క‌లిగించాయి సినిమాలోని దృశ్యాలు.


ఒక నగరాన్నే నిర్మించాడు

ఒక నగరాన్నే నిర్మించాడు

సామాన్య ప్రేక్షకులే కాదు సినీ దిగ్గజాలు కూడా ఆశ్చర్య పోయారు. సినిమా కోసం ఒక నగరాన్నే నిర్మించాడు రాజమౌళి. అసలు మాహిష్మతి సామ్రాజ్యం నిజంగా ఉందనిపించేలా ఉన్న వర్క్ టాలీవుడ్ నే కాదు మొత్తం దేశాన్నే ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ బాలీవుడ్ ప్రముఖుల్లో కొందరు ఇంకా అసూయ తోనే ఉన్నట్టున్నారు.


కమేడియన్ ఆఫ్ బాలీవుడ్

కమేడియన్ ఆఫ్ బాలీవుడ్

కనీసం బాహుబలి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. కమేడియన్ ఆఫ్ బాలీవుడ్ అని పిలిపించుకునే కమాల్ ఆర్ ఖాన్ లాంటి వ్యక్తి అయితే డైరెక్ట్ గానే. రాజమౌళి ని చుతియా అనీ, ప్రభాస్ ఒంటెలా ఉంటాడనీ విషం చిమ్మాడు. మొదట్నుంచీ సౌతిండియన్ సినిమా మీద కమాల్ అసూయ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే కాబట్టి., అతని కమెంట్లకి అంతా నవ్వుకున్నారు తప్ప పెద్దగా పట్టించుకోలేదు.


సీనియర్ నటుడు రిషీ కపూర్

సీనియర్ నటుడు రిషీ కపూర్

అయితే మరికొందరు సీనియర్లు మాత్రం నిజాయితీగానే ఒప్పేసుకుంటున్నారు, బాహుబలి ప్రభంజనానికి బాలీవుడ్ కూడ సాహో అంటోందంటూ తమ అభిప్రాయాలని చెప్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా సీనియర్ నటుడు రిషీ కపూర్ కూడా బాహుబలి లో మాహిష్మతి ని చూసి తాను ఆశ్చర్య పోయానంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు.


2 బీహెచ్‌కే ఇల్లు తీసుకోవాల‌ని ఉంద‌ని

2 బీహెచ్‌కే ఇల్లు తీసుకోవాల‌ని ఉంద‌ని

బాహుబ‌లి సినిమా ఎక్క‌డ తీశారో ఎవ‌రైనా చెప్పాల‌ని.. ఇందులో త‌న‌కో 2 బీహెచ్‌కే ఇల్లు తీసుకోవాల‌ని ఉంద‌ని.. ఎవ‌రైనా ఏజెంట్ ఉన్నాడా అని చ‌మ‌త్కారంగా ట్వీట్ పెట్టాడు రిషి క‌పూర్‌. బాహుబ‌లి సినిమా ఇండియ‌న్ సెల‌బ్రేష‌న్ అని.. ఇలాంటి సినిమా బిజినెస్‌లో తాను కూడా భాగ‌మైనందుకు గ‌ర్వంగా ఉంద‌ని రిషి క‌పూర్ అన్నాడు. ఈ సినిమా సాధించిన విజ‌యం.. దాని బిజినెస్‌ను మ్యాచ్ చేయ‌డం మిగ‌తా ఫిలిం మేక‌ర్ల‌కు చాలా క‌ష్ట‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌పడ్డాడు..English summary
"Seeing Bahubali 2 now. Interval. Chat later about the film. I want to know where has this film been shot? I want a 2 BHK there! Any agent?" Tweets Rishi Kapoor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu