వేటాడిన కేసు, కోర్టుకు హాజరైన సైఫ్, సోనాలి, టబు
జోధ్‌పూర్: పదిహేనేళ్ల నాటి కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, హీరోయిన్లు సోనాలీ బింద్రే, టబు శుక్రవారం జోధ్‌పూర్ కోర్టుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఒక రోజు ముందే వారు విమానంలో జోధ్ పూర్ చేసుకున్నారు. ఆ సమయంలో వారు మీడియా కంటపడ్డారు.
కేసు వివరాల్లోకి వెళితే.... గతంలో కోర్టు వీరిపై పలు అభియోగాలు నమోదు చేసింది. జోధ్‌పూర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వారి కేసును విచారిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51, 9/52 సెక్షన్లతో పాటు భారతీయ శిక్షా స్మృతిలోని 149 సెక్షన్ కింద వారిపై అభియోగాలు మోపారు.
కృష్ణజింకల వేటలో పాల్గొన్న నటీనటులపై అభియోగాలను 2012 డిసెంబర్‌లో హైకోర్టు సవరించింది. 1998 అక్టోబర్ 1 అర్ధరాత్రి దాటాక జోధ్‌పూర్ సమీపంలో రెండు కృష్ణజింకలను వేటాడి చంపడంతో బాలీవుడ్ నటీ నటులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల క్రిందట జరిగిన సంఘటనకు సంబంధించిన కేసు ఇప్పటికీ ఓ కొలక్కి రావడం లేదు. ఏళ్ల తరబడి విచారణ సాగుతోంది.


Click it and Unblock the Notifications












