»   » ఇఫ్తార్ పార్టీలో సందడి చేసిన స్టార్స్(ఫోటోలు)

ఇఫ్తార్ పార్టీలో సందడి చేసిన స్టార్స్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ మంగళవారం(ఆగస్టు 6) రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీ స్టార్స్ రాకతో సందడిగా సాగింది. దాదాపు బాలీవుడ్‌కి టాప్ స్టార్స్ అందరితో పాటు పలువురు పొలిటీషియన్స్, పలువురు ముఖ్య ప్రభుత్వ అధికారులు ఈ పార్టీకి హాజరయ్యారు.

హాజరైన స్టార్స్‌లో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, అర్షద్ వర్సి, ఇమ్రాన్ హస్మి, చిత్రాంగద సింగ్, కాజోల్, సోనమ్ కపూర్, టబు, జితేంద్ర, రణవీర్ సింగ్, శృతి హాసన్, రిషి కపూర్, మలైకా అరోరా ఖాన్, ప్రాచి దేశాయ్, అభిషేక్ బచ్చన్, అమృత రావు, శతృజ్ఞ సిన్హా, లీసా హెడెన్, భర్త రితేష్ దేశ్ ముఖ్‌తో కలిసి జెనీలియా తదితరులు హాజరయ్యారు.

ఇఫ్తార్ పార్టీ గురించి ఏక్తా కపూర్ మాట్లాతూ...'నేను కూడా కొన్ని రోజులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నాను, ఇది నిజం. ఆగస్టు 6న జరుగుతున్నఈ ఇఫ్తార్ పార్టీ ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే రంజాన్ మాసంలో 27 రోజులు పూర్తయింది. 12 సంవత్సరాల నుంచి నేను రంజాన్ ఉపవాస దీక్షల్లో పాలుపంచుకుంటున్నాను' అని పేర్కొన్నారు.

ఈ ఇఫ్తార్ పార్టీ సందర్భంగా ఏక్తా కపూర్ తను నిర్మిస్తున్న తాజా సినిమా 'వన్స్ అపానె టైం ఇన్ ముంబై దొబారా'ను ప్రమోట్ చేసుకుంది. 2010లో వచ్చిన 'వన్స్ అపానె టైం ఇన్ ముంబై' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ ఖాన్ లీడింగ్ రోల్స్ చేస్తుండగా, సోనాలి బింద్రె సపోర్టింగ్ రోల్ చేస్తోంది.

'వన్స్ అపానె టైం ఇన్ ముంబై దొబారా' చిత్రాన్ని తొలుత ఆగస్టు 9న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజు షారుక్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' రిలీజ్ ఉండటంతో ఈచిత్రాన్ని ఆగస్టు 15కి వాయిదా వేసారు.

ఇఫ్తార్ పార్టీ ఫోటోలు స్లైడ్ షోలో....

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్


బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఏక్తాకపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా సోనమ్ కపూర్ ఇలా ఆకట్టుకునే లుక్‌తో దర్శనం ఇచ్చింది. ఫోటోలకు ఫోజులు ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్


బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఏక్తాకపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చారు. పార్టీలో ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

కాజోల్

కాజోల్


మాజీ స్టార్ హారోయిన్ కాజోల్, ఏక్తాకపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి ఇలా సెక్సీ లుక్‌తో హాజరైంది. ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంది. పార్టీలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇమ్రాన్ హస్మి

ఇమ్రాన్ హస్మి


కిస్సుల హీరోగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో ఇమ్మాన్ హస్మి. ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఇమ్రాన్ హస్మి ఇలా ఆకట్టుకునే వేషధారణలో సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. పార్టీలో ఆయన అందరితో కలివిడిగా గడిపారు.

అక్షయ్-ట్వింకిల్

అక్షయ్-ట్వింకిల్


‘వన్స్ అపానె టైం ఇన్ ముంబై దొబారా' ముంబై హీరో అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా మారారు.

అమిత్ సాధ్

అమిత్ సాధ్


కాయ్ పో చె నటుడు అమిత్ సాధ్ కూడా ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ‘వన్స్ అపానె టైం ఇన్ ముంబై దొబారా' కటౌట్ ముందు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కంగనా రనౌత్

కంగనా రనౌత్


బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, ఏక్తాకపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఇలా బ్లాక్ డ్రెస్ లో హాజరయింది. అయితే ఆమె ఈ డ్రెస్సులే ఏమంత అందంగా లేదనే విమర్శలు వినిపించాయి. ఆమె లుక్ కూడా డల్‌‍గా ఉంది.

కబీర్-మిని

కబీర్-మిని


బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ తన భార్య మిని మాథుర్‌తో కలిసి ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వారు ఫోటోలకు ఇలా ఫోజులు ఇచ్చారు.

అర్షద్-మారియా

అర్షద్-మారియా


బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి తన భార్య మారియాతో కలిసి ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ దంపతులు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అక్షయ్, సోనాక్షి, ఇమ్రాన్, మిలన్

అక్షయ్, సోనాక్షి, ఇమ్రాన్, మిలన్


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ హస్మి, దర్శకుడు మిలన్ లుథారియా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వీరు పార్టీలో ఎంతో సందడిగా గడిపారు.

అర్భాజ్ ఖాన్-మలైకా

అర్భాజ్ ఖాన్-మలైకా


బాలీవుడ్ నిర్మాత, నటుడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా ఖాన్‌తో కలిసి ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఓ గెస్టుతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

హుమా ఖురేషి

హుమా ఖురేషి


బాలీవుడ్ నటి హుమా ఖురేషి, ఏక్తా కపూర్ ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందుకు ఆకట్టుకునేలా సాంప్రదాయ వస్త్రధారణతో హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

జితేంద్ర

జితేంద్ర


ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర, తన కూతురు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అతిథులను పలకరిస్తూ సందడిగా గడిపారు.

చిత్రాంగద సింగ్

చిత్రాంగద సింగ్


బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ భామల్లో ఒకరైన చిత్రాంగద సింగ్ కూడా ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆహార్యం, సెక్సీ లుక్ అందరినీ ఆకట్టు కుంది.

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్


బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రణవీర్ ఇలా ఫోటోలకు ఫోలు ఇచ్చారు. పార్టీలో ఆయన అందరితో సందడిగా గడిపారు.

శృతి హాసన్

శృతి హాసన్


హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల పలు బాలీవుడ్ చిత్రాలతో ముంబైలో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. రెడ్ కలర్ డ్రెస్‌లో హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చింది శృతి.

రాకేష్, పింకీ, రిషి, మిలిన్

రాకేష్, పింకీ, రిషి, మిలిన్


బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన రాకేష్ రోషన్ తన భార్య పింకీతో కలిసి హాజరయ్యారు. వారితో పాటు ప్రముఖ నటుడు రిషి కపూర్, మిలన్ లుథారియాలు కూడా ఇక్కడ ఫోటోలకు ఫోజలు ఇచ్చారు.

ప్రాచీ, ఏక్తా, సోనాలి

ప్రాచీ, ఏక్తా, సోనాలి


ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేసిన ఏక్తా కపూర్ బాలీవుడ్ హీరోయిన్లయిన ప్రాచీ దేశాయ్, సోనాలి బింద్రేలతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పార్టీలో ఏక్తా కపూర్ అందరితో సరదాగా గడిపింది.

టబు

టబు


బాలీవుడ్ హీరోయిన్ టబు ఇలా సారీలో హాట్ లుక్‌‌తో హాజరైంది. ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో టబు అందరితో కలివిడిగా గడిపింది.

శతృజ్ఞ సిన్హా

శతృజ్ఞ సిన్హా


ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృజ్ఞ సిన్హా, ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో పొలిటీషియన్స్‌తో కలిసి ఇలా దర్శనం ఇచ్చారు. ఆ పార్టీకి ముంబైలోని ప్రముఖ పొలిటీషియన్స్ హాజరయ్యారు.

ఊర్మిళా మండోద్కర్

ఊర్మిళా మండోద్కర్


ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మండోద్కర్ పింక్ కలర్ డ్రెస్‌లో ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రాహుల్ బోస్

రాహుల్ బోస్


ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్, ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఇలా ఆకట్టుకునే లుక్‌తో హాజరయ్యారు. ఆయన ఈ పార్టీలో అందరితో సందడిగా గడిపారు.

షమితా శెట్టీ

షమితా శెట్టీ


బాలీవుడ్ నటి శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు ఇలా సాంప్రదాయ దుస్తువుల్లో హాజరయ్యారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

టీనా

టీనా


బాలీవుడ్ నటి టీనా ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇప్తా్ పార్టీకి ఇలా మోడ్రన్ లుక్‌తో హాజరైంది. పార్టీకి వచ్చిన ప్రముఖులతో కరచాలనం చేస్తూ సందడిగా గడిపింది.

జాకీ భగ్నానీ

జాకీ భగ్నానీ


ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు బాలీవుడ్‌కు చెందిన జాకీ భగ్నానీ హాజరయ్యారు.

English summary
Bollywood's who's who attended Ekta Kapoor's grand Iftar party on Tuesday night(6 August). Along with B-Town actors many top-level politicians and government officials also attended the party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu