»   » గే హీరోలు, లెస్బియన్ హీరోయిన్లు! (ఫోటోస్)

గే హీరోలు, లెస్బియన్ హీరోయిన్లు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ సినిమాల్లో స్వలింగ సంపర్కం కథాంశంతో కూడిన సినిమాలు సర్వసాధారణం. అయితే రాను రాను ఇలాంటి కథాంశాలతో కూడిన సినిమాల జోరు ఇండియన్ సినిమాల్లోనూ పెరిగి పోతోంది. పలువురు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సైతం గే పాత్రల్లో, లెస్పిబయన్ పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు, పాత్రల జోరు ఎక్కువగా ఉంది. కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, షబానా అజ్మీ, నందితా దాస్, రిషి కపూర్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు సైతం ఇలాంటి పాత్రల్లో నటించడానికి ముందుకు రావడంతో ఈ తరహా సినిమాలకు ఆదరణ కూడా బాగానే ఉంటోంది.

గే, లెస్బియన్ కథాంశాలు, పాత్రలతో కూడిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

బోల్ బచ్చన్‌లో అభిషేక్ బచ్చన్

బోల్ బచ్చన్‌లో అభిషేక్ బచ్చన్


రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన బోల్ బచ్చన్ సినిమాలో జూనియర్ బచ్చన్ అభిషేక్ గే పాత్రలో నటించాడు. ఆయన పోషించిన ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా మారింది.

మాధురి దీక్షిత్, హుమా ఖురేషి

మాధురి దీక్షిత్, హుమా ఖురేషి


ఇటీవల విడుదలైన హిందీ మూవీ డేడ్ ఇష్కియాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్, హుమా ఖురేషి లెస్బియన్ పాత్రల్లో స్వలింగ సంపర్కులుగా నటించారు.

దున్నో వై...న జానె క్యో

దున్నో వై...న జానె క్యో


2010లో వచ్చిన బాలీవుడ్ మూవీ దున్నో వై...న జానె క్యో చిత్రాన్ని అప్పట్లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. ఇద్దరు మగాళ్లు ముద్దుల్లో మునిగి తేలడం లాంటి సన్నివేశాలు సినిమాకు పాపులారిటీ తెచ్చాయి.

షబానా అజ్మీ, నందితా దాస్ ‘ఫైర్'

షబానా అజ్మీ, నందితా దాస్ ‘ఫైర్'


ఫైర్ అనే బాలీవుడ్ మూవీలో ప్రముఖ నటీమణులు షబానా అజ్మీ, నందితా దాస్‍‌లు లెస్బియన్లుగా నటించారు. ఈ ఇద్దరూ సినిమాల్లో లిప్ లాక్ సీన్లలో నటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

గర్ల్ ఫ్రెండ్

గర్ల్ ఫ్రెండ్


గర్ల్ ఫ్రెండ్ అనే బాలీవుడ్ సినిమాలో ఇషా కొప్పీకర్, అమృతా అరోరా లెస్పియన్లుగా నటించారు.

హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి

హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి


హనీ మూన్ ట్రావెల్స్ ప్రై.లి అనే బాలీవుడ్ మూవీలో విక్రమ్ చత్వాల్.....పెళ్లియిన తర్వాత హనీమూన్ ట్రిప్‌కు సందర్భంలో గేగా మారినట్లు చూపించారు. ఈ సినిమాలో అమీషాను పెళ్లిడిన కరన్ ఖన్నా, విక్రమ్ వైపు ఆకర్షితుడు అవుతాడు.

కరీనా కపూర్, షహానా గోస్వామి

కరీనా కపూర్, షహానా గోస్వామి


మాధుర్ బండార్క్ దర్శకత్వంలో వచ్చిన్ ‘హీరోయిన్' మూవీలో షహానా గోస్వామి, కరీనా కపూర్‌ల మధ్య లెస్పిబయన్ లవ్ మేకింగ్ సీన్లను క్రియేట్ చేసారు.

మ్యాంగో సౌఫ్లీ

మ్యాంగో సౌఫ్లీ


2002లో వచ్చిన మ్యాంగో సౌఫ్లి అనే చిత్రం ఇండియాలో తెరకెక్కిన మొదటి గే చిత్రంగా రికార్డులకెక్కింది.

మై బ్రదర్ నిఖిల్

మై బ్రదర్ నిఖిల్


‘మై బ్రదర్ నిఖిల్' అనే చిత్రాన్ని కూడా గే కథాంశంతో తెరకెక్కించారు. హెచ్ఐవితో బాధపడే గే సొసైటీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు అనే అంశాలు ఇందులో చూపించారు.

రాగిణి ఎంఎంఎస్ 2

రాగిణి ఎంఎంఎస్ 2


త్వరలో విడుదలకు కాబోతున్న ‘రాగిణి ఎంఎంస్ 2' చిత్రంలో కూడా సెల్బియన్ క్యారెక్టర్లు ఉంటాయని స్పష్టమవుతోంది.

రిషి కపూర్

రిషి కపూర్


ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలో గే పాత్రలో కనిపించారు. ఇందులో ఆయన రోహిత్ రాయ్‍‌ని అమితంగా ఇష్టపడుతుంటారు.

సమీర్ సోని

సమీర్ సోని


నటుడు సమీర్ సోని మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యాషన్ చిత్రంలో గే పాత్రలో కనిపించారు.

English summary
Though the portrayal of gay and lesbian characters have not been as bold as Hollywood in Hindi cinema, Bollywood too has touched upon the topic in its own way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu