»   » వివాదం‌: ‘ఫ్యాన్‌’కథ నాదేనంటూ కేసు, రిలీజ్ అపమని కోర్టుకి

వివాదం‌: ‘ఫ్యాన్‌’కథ నాదేనంటూ కేసు, రిలీజ్ అపమని కోర్టుకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొలిదీ, పెద్ద సినిమాలకు రకరకాల సమస్యలు ఎదురౌతూంటాయి. ముఖ్యంగా తమ కథని కాపీ కొట్టి తీసారంటూ కరెక్టుగా రిలీజ్ కు ముందు కోర్టుకు వెళ్లి స్టే అడుగుతూండటం చాలా సార్లు జరిగింది. ఇప్పుడు షారూఖ్ కు అలాంటి సమస్యే ఎదురైంది.

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ఖాన్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'ఫ్యాన్‌'. మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రం విడుదల కానున్న సమయంలో చిత్ర బృందం వివాదంలో చిక్కుకుంది. కథ హక్కులు తనవే అంటూ మహేశ్‌ ధోయ్‌జోడి అనే చిత్ర నిర్మాత కోర్టును ఆశ్రయించారు.

చిత్ర విడుదలపై స్టే విధించాలంటూ కోరారు. చిత్ర కథ తాను 1997లో రాసుకున్న దానికి అనుగుణంగా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కథను తమిళ రైటర్స్‌ అసోసియేషన్‌లో అభినేత అనే పేరుతో రిజిస్టర్‌ చేయించానని ఆరోపిస్తున్నాడు.

 Bombay HC refuses to stay release on the film on copyright violation charge

ఈ విషయం గురించి మహేశ్‌ రూ.25కోట్లు తనకు ఇవ్వాలంటూ డిమాండు చేస్తున్నాడు. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌, నిర్మాత ఆదిత్య చోప్రా, రచయిత హబిబ్‌, కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌, దర్శకుడు మనీశ్‌ శర్మలకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు.

ఇక బాలీవుడ్‌ యువ దర్శకుడు మనీష్‌శర్మ.. 'బ్యాండ్‌ బాజా బారాత్‌'.. 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో షారుఖ్‌ఖాన్‌ని 'ఫ్యాన్‌'గా ప్రేక్షకులకు చూపించనున్న మనీష్‌.. ఈ కథను బాద్‌షాను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నానని చెబుతున్నాడు. ఈ శుక్రవారం 'ఫ్యాన్‌' విడుదల కానున్న నేపథ్యంలో మనీష్‌ ఇలా చెప్పుకొచ్చారు.

''అసలు ఈ కథను షారుఖ్‌ని దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాను. ఇలాంటి సినిమాలు షారుఖ్‌ మాత్రమే చేయగలరు. ఆయన కాకుంటే ఈ కథ వెండితెరపైకి వచ్చేదే కాదు. వేరే వాళ్లయితే ఈ వయసులో 16 ఏళ్ల కుర్రాడిలా నటించాలంటే కాస్త ఆలోచిస్తుంటారు. షారుఖ్‌ మాత్రం చాలా ఉత్సాహంగా ఆ ప్రాతలో లీనమైపోయారు'' అని మనీష్‌ చెప్పుకొచ్చాడు.

English summary
Justice Gautam Patel was hearing a suit filed by writer-director Mahesh Doijode, who claimed that he wrote a script, which has similarities with "Fan", in 1994 and had registered it with the Film Writers Association under the name 'Abhineta' in 1997.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu