»   » రాంగోపాల్ వర్మకు చెంపపెట్టు.. సర్కార్3 కేసులో కోర్టు షాకింగ్ జడ్జిమెంట్!

రాంగోపాల్ వర్మకు చెంపపెట్టు.. సర్కార్3 కేసులో కోర్టు షాకింగ్ జడ్జిమెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సర్కార్3 చిత్రానికి సంబంధించిన కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. సర్కార్3 కథా రచయితగా క్రెడిట్ ఇవ్వడంతోపాటు రైటర్ నీలేశ్ గిర్కార్‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశాలివ్వడంతో ఈ కేసులో వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. మే 12 తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలాంటి కోర్టు ఆదేశాలు రావడం వర్మకు ఊహించిన పరిణామమే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  క్రెడిట్ ఇవ్వడం లేదు..

  క్రెడిట్ ఇవ్వడం లేదు..

  సర్కార్ సినిమా కథా రచయితగా తనకు క్రెడిట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారనే ఆరోపణలపై రచయిత గిర్కార్ ఈ ఏడాది జనవరి 30 తేదీన బాంబే కోర్టులో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తనకు ఇవ్వాల్సిన రూ.8 లక్షలు ఇప్పించాలని కోర్టును వేడుకొన్నాడు. ఈ కేసును విచారించిన బాంబే కోర్టు రచయితకు క్రెడిట్ ఇవ్వడంతోపాటు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

  కోర్టు స్పష్టమైన ఆదేశాలు..

  కోర్టు స్పష్టమైన ఆదేశాలు..

  ఈ కేసులో జస్టిస్ గౌతమ్ పటేల్ తన తీర్పును వెల్లడిస్తూ డిజిటల్, శాటిలైట్, సినిమా ప్రింట్లపై రచయిత నీలేశ్ గిర్కార్‌ పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. నీలేశ్ గిర్కార్ రాసిన స్టోరీ ఈ సినిమాు ఆధారం అని టైటిల్స్‌లో నిబంధనల ప్రకారం స్పష్టంగా పేర్కొనాలి అని అన్నారు. అంతేకాకుండా కోర్టుకు దాఖలు చేసిన రూ.6 లక్షల స్క్రిప్ట్ ఫీజును విత్‌డ్రా చేసుకోవచ్చని న్యాయమూర్తి ఆదేశించడం గమనార్హం. ఈ క్రమంలో గిర్కార్ దాఖలు చేసిన పిటిషన్ రద్దు చేసింది.

  అందుకే వర్మపై ఫిర్యాదు చేశాను.,.

  అందుకే వర్మపై ఫిర్యాదు చేశాను.,.

  2012లో సర్కార్3 సినిమాకు సంబంధించిన కథను రాసి రాంగోపాల్ వర్మకు ఇచ్చాను. కానీ వర్మ తనకు క్రెడిట్ ఇవ్వడానికి నిరాకరించాడు. అందతేకాకుండా స్క్రిప్ట్ పారితోషికం కూడా ఇవ్వడానికి అంగీకరించలేదు. దాంతో కోర్టుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని నీలేశ్ గిర్కార్ తెలిపారు. కోర్టుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెమ్యునరేషన్ మొత్తం రూ.6.2 లక్షలను కోర్టుకు వర్మ దాఖలు చేయడం గమనార్హం.

  కోర్టు ఆదేశాలను పాటిస్తాను..

  కోర్టు ఆదేశాలను పాటిస్తాను..

  బాంబే కోర్టు వెల్లడించిన తీర్పు గురించి మీడియా సంప్రదించగా.. కోర్టు ఆదేశాలు తుచ తప్పకుండా పాటిస్తాను అని వర్మ చెప్పినట్టు సమాచారం. సర్కార్ సిరీస్‌లో మూడో భాగంగా రూపొందిన సర్కార్3 సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో అమితాబ్, జాకీ ష్రాఫ్, అమిత్ సద్, యామీ గౌతమ్, రోనిత్ రాయ్, రోహిణి హట్టంగడి, మనోజ్ బాజ్‌పేయ్ తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Film maker, Ram Gopal Verma, was on Monday directed by the Bombay High Court, to give proper credit to writer Nilesh Girkar, in his upcoming film Sarkar 3, which releases on May 12. ustice Gautam Patel said Verma will have to mention in all its prints of the film, satellite and digital forms, 'Based on a story written by Nilesh Girkar.' This the court said will have to appear in the opening credits with the same pause, font and prominence as equivalent credits.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more