»   » శ్రీదేవి చనిపోయాక బోని ఫస్ట్ కాల్ అతడికే..సైలెంట్ మోడ్‌లో ఫోన్!

శ్రీదేవి చనిపోయాక బోని ఫస్ట్ కాల్ అతడికే..సైలెంట్ మోడ్‌లో ఫోన్!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మృతి విషయంలో దుబాయ్ అధికారులు విచారం కొనాగిస్తున్నారు. అధికారులు కేసుని ఓ కొలిక్కి తీసుకునివస్తే కానీ శ్రీదేవి మృతి విషయంలో మిస్టరీ వీడేలా కనిపించడంలేదు. అంతకన్నా ముందు శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు పంపాలని అధికారులు కోరుకుంటున్నారు. అది జరగాలంటే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు ఈ కేసులో ఎలాంటి మిస్టరీ లేదని నిర్ధారించాలి. దీనితో శ్రీదేవి భౌతిక ఖాయం ఇండియాకు రావడానికి సమయం పెట్టె అవకాశం కనిపిస్తోంది. కాగా అధికారులు బోనికపూర్ కాల్ డేటాని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బోణి ఎక్కువసార్లు ఎంపీ అమర్ సింగ్ కు ఫోన్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

Sridevi : Cops Question Boney Kapoor, Statement Recorded
నేడు కూడా అనుమానమే

నేడు కూడా అనుమానమే

శ్రీదేవి పార్థివ దేహం మంగళవారం కూడా ఇండియాకు వచ్చే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబాయ్ లో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు శ్రీదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

బోని కాల్ డేటా పరిశీలన

బోని కాల్ డేటా పరిశీలన

దుబాయ్ పోలీస్ లు ఈ కేసుని ఓ కొలిక్కి తీసుకుని వచ్చేందుకు బోని కపూర్ కాల్ డేటాని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి మృతికి ముందు ఏం జరిగిందనే వివరాలని పోలీస్ లు సేకరించే పనిలో ఉన్నారు.

 కాల్ లిస్ట్ లో అతడి నంబర్ ఎక్కువగా

కాల్ లిస్ట్ లో అతడి నంబర్ ఎక్కువగా

శ్రీదేవి మరణం తరువాత బోని కపూర్ ఎక్కువసార్లు ఎంపీ అమర్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కాల్ లిస్ట్ లో ఎక్కవగ అమర్ సింగ్ నంబర్ ఉన్నట్లు పోలీస్ లు గుర్తించారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఫస్ట్ కాల్ అతడికే

ఫస్ట్ కాల్ అతడికే

దీనిపై జాతీయ మీడియా అమర్ సింగ్ ని ఆరాతీసే ప్రయత్నం చేసింది. అమర్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం బోనికపూర్ శ్రీదేవి మరణం తరువాత మొట్టమొదటి కాల్ అమర్ సింగ్ చేసినట్లు తెలుస్తోంది.

సైలెంట్ మోడ్ లో ఫోన్

సైలెంట్ మోడ్ లో ఫోన్

అర్థరాత్రి 12 గంటల 40 నిమిషాలకు బోని తనకు ఫోన్ చేసారని అమర్ సింగ్ అన్నారు. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండడంతో తాను గుర్తించలేదని అన్నారు. ఆ తరువాత ల్యాండ్ లైన్ ననంబర్ కు చేసారు. గద్గ స్వరంతో శ్రీదేవి మరణ వార్తని వినిపించారు. బహుశా ఆ విషయం ఆయన నాకే మొదటి చెప్పి ఉండవచ్చు అని అమర్ అన్నారు.

బోని ఫ్యామిలీతో ఫ్రెండ్ షిప్

బోని ఫ్యామిలీతో ఫ్రెండ్ షిప్

బోని కపూర్ కుటుంబానికి అమర్ సింగ్ బాగా సన్నిహితుడు. బోని కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉందని అమర్ సింగ్ తెలిపారు. శ్రీదేవి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆల్కహాల్ సేవించి ఉందని రావడంతో ఆయన ఖండించారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని, చాలా తక్కువ సందర్భాల్లో వైన్ తీసుకుంటారని అన్నారు.

English summary
Boney Kapoor made first call to Amar Singh after Sridevi death. Dubai police verifying Boney's call data.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu