»   » రాజమౌళి సపోర్టు: బొత్స మేనల్లుడు హీరోగా ఎంట్రీ (ఫోటోస్)

రాజమౌళి సపోర్టు: బొత్స మేనల్లుడు హీరోగా ఎంట్రీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక రాజకీయ నేతల్లో ఒకరు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు రంజిత్ సోమి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భరత్ సోమి నిర్మాతగా, దిక్కులు చూడకు రామయ్య ఫేం త్రికోటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో శుక్రవారం జరిగింది. రాజమౌళి దంపతులు హాజరై తమ మద్దతు ప్రకటించారు. వీరితో పాటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కీరవాణి, నిర్మాత సురేష్ బాబు, దిల్ రాజు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, అజయ్, బొత్స దంపతులు హాజరయ్యారు.

ఈ చిత్రంలో పల్లక్ లవ్వాని హీరోయిన్ గా నటిస్తోంది. తొలి సన్నివేశానికి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా, బొత్స సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత భరత్ సోమి మాట్లాడుతూ 'సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుండి ప్రారంభమవుతుంది. సినిమా కథ నచ్చడంతో మా తమ్ముడ్ని హీరోగా పెట్టి సోమ్మి ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమా చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం' అని చెప్పారు.

స్లైడ్ షోలో సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోస్...

లవ్, యాక్షన్ ఎంటర్టైనర్

లవ్, యాక్షన్ ఎంటర్టైనర్


ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టెనర్ గా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు త్రికోటి తెలిపారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ..

హీరో రంజిత్ మాట్లాడుతూ..


మా బ్యానర్ రూపొందనున్నమొదటి సినిమా. లెజెండ్ సినిమాకు మాటలు అందించిన రత్నం గారు ఈ సినిమాకు కూడా కథ, మాటలు అందించారు. దర్శకుడు త్రికోటి గారిపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను'' అని చెప్పారు.

పల్లక్ లవ్వాని మాట్లాడుతూ..

పల్లక్ లవ్వాని మాట్లాడుతూ..


సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. పాజిటివ్, ఎనర్జిటిక్ టీం తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నాకు కథ బాగా నచ్చింది. అదే నమ్మకంతో సినిమా చేయడానికి అంగీకరించాను అని చెప్పారు.

నటీనటులు

నటీనటులు


రంజిత్ సోమి, పల్లక్ లల్వాని, అర్జున ఈ చిత్రంలో ముఖ్య పత్రలు పోషిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: మురళి కొండేటి, నిర్మాత: భరత్ సోమి, దర్శకత్వం: త్రికోటి పేట

రంజిత్ సోమి

రంజిత్ సోమి


మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు రంజిత్ సోమి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు

సోదరుడే నిర్మాత

సోదరుడే నిర్మాత


రంజిత్ సోదరుడు భరత్ సోమి నిర్మాతగా, దిక్కులు చూడకు రామయ్య ఫేం త్రికోటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

రామానాయుడు స్టూడియో

రామానాయుడు స్టూడియో


ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో శుక్రవారం జరిగింది

కీరవాణి

కీరవాణి


ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కీరవాణి, నిర్మాత సురేష్ బాబు, దిల్ రాజు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, అజయ్, బొత్స దంపతులు హాజరయ్యారు.

షూటింగ్

షూటింగ్


సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుండి ప్రారంభమవుతుంది.

రాజమౌళి దంపతులు

రాజమౌళి దంపతులు


రాజమౌళి దంపతులు హాజరై తమ మద్దతు ప్రకటించారు.

English summary
Former Minister Botsa Satyanarayana's nephew Ranjith Somi enter Film Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu