»   » హీరోయిన్ ని ఫోటోలు తీసారని, రక్తం వచ్చేలా కొట్టారు

హీరోయిన్ ని ఫోటోలు తీసారని, రక్తం వచ్చేలా కొట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఫోటోలను తీస్తుండగా బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద గురువారం చోటు చేసుకుంది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కలిసి హోటల్ నుంచి బయటకు వస్తుండగా అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించినందు ఫొటోగ్రాఫర్లమీద విచక్షణారహితంగా దాడి జరిగింది. ఈ ఘటనపై బాధిత ఫోటోగ్రాఫర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముంబైలో అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. నటి శిల్పా శెట్టి, భర్త రాజ్‌కుంద్రాతో డిన్నర్‌ కోసం ముంబై, బంద్రాలోని బస్టైన్‌ హోటల్‌కు వచ్చారు. ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. విధుల్లో హోటల్ బౌన్సర్లు.. ఫోటోగ్రాఫర్లపై విచక్షణారహితంగా దాడి చేశారు.

 Bouncers beat up paparazzi for clicking pictures of Shilpa Shetty

వారు అలా కారు ఎక్కగానే, ఇలా హోటల్ బౌన్సర్లు దాడికి దిగి, దొరికిన వారిని దొరికినట్టు బాదేశారు. ఈ ఘటనలో సోను, హిమాన్షు షిండే అనే ఫోటో జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియో తీయగా, ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హోటల్ బౌన్సర్ల దాడిపై జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోను వార్తా సంస్థ 'ఏఎన్ఐ' షేర్ చేసింది.

English summary
Restaurant bouncers beat up paparazzi for clicking pictures of Shilpa Shetty and Raj Kundra
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu