»   » బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ హీరోగా చిత్రం..వివరాలు

బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ హీరోగా చిత్రం..వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Boxer Vijender Singh
ముంబై: బాక్సింగ్‌ రింగ్‌లో తన ముష్టిఘాతాలతో ఎందరో ప్రత్యర్థులను మట్టికరిపించిన ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌, అశ్విని యార్డి సంయుక్త సినీ నిర్మాణ సంస్థ అయిన 'గ్రాజింగ్‌ గోట్‌ పిక్చర్స్‌' ద్వారా నిర్మిస్తున్న ఆ చిత్రం 'ఫగ్లే'. దర్శకుడు, నటుడు అయిన కబీర్‌ సదానంద్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ త్రికోణ ప్రేమ కథాచిత్రంలో విజేందర్‌తో పాటు నటుడు అనిల్‌కపూర్‌ దగ్గిర బంధువైన మోహిత్‌ మార్వా, కియారా అద్వానీలు నటిస్తున్నారు.

కియారా కుటుంబం ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు చాలా సన్నిహితంగా ఉంటుందని, ఆయన సిఫార్సుతోనే కైరాకు ఈ పాత్రదక్కిందని ఒక రూమర్‌. ఈ ఫగ్లే చిత్రం సందేశాత్మకంగా ఉంటుందని, కథానుసారంగా చాలా భాగాన్ని లెహ్‌, లఢక్‌ల్లోని లామాయూరా బౌద్ధారామం, పాన్‌గోంగ్‌ సరస్సు, మాగ్నటిక్‌ హిల్‌, మూన్‌ ల్యాండ్‌ వంటి ప్రదేశాల్లో అధిక సన్నివేశాలను చిత్రీకరించామంటున్నారు దర్శకుడు.

విజేందర్‌ కెమేరా ముందు తొలిసారి నటిస్తున్నా ఏ విధమైన బెరుకులేకుండా తన పాత్రను చాలా సహజంగా పోషించారని మెచ్చుకుంటున్నారు కబీర్‌. ఎత్త్తెన ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌ వల్ల తాను వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్పులో పాల్గొనడానికి చేసిన కసరత్తుల వలే పనిచేసిందంటాడు ఒలింపిక్‌ రజత పతకం విజేత అయిన విజేందర్‌.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందా కుమార్తె అయిన నర్మదతో విజేందర్‌ సింగ్‌ రెండు సంవత్సరాల క్రితమే తెరంగేట్రం చేస్తారన్న వార్త బాలీవుడ్‌లో షికారు చేసింది. కానీ అదే సంవత్సరం విజేందర్‌ వివాహం కావడంతో మహిళా ప్రేక్షకుల్లో ఈయనకున్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోలేమని భావించిన నిర్మాతలు వెనకడుగువేశారన్న వదంతి వినిపించింది.

English summary
Vijender’s early days were spent in his village where he did his schooling, after which he received a bachelor’s degree from a local college in Bhiwani.Olympic bronze-medalist Vijender Singh will be seen in a social thriller film backed by actor Akshay Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu