»   » బోయపాటి నివాసంలో ‘లెజెండ్’ వేడుకలు (ఫోటోలు)

బోయపాటి నివాసంలో ‘లెజెండ్’ వేడుకలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లెజెండ్ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నందమూరి అభిమానుల సమక్షంలో ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను వివాసంలో వేడక నిర్వహించారు. విజయోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు దర్శకుడు బోయపాటి శ్రీను తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పోస్టు చేసారు.

లెజెండ్ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....ఇదొక మరుపురాని విజయమని, ఒక సినిమా 50 రోజులు ఫుల్ కలెక్షన్లతో నడవటం కష్టమైన ఈ రోజుల్లో చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రేక్షకులు, అభిమానుల ఆదరణే కారణమని అన్నారు.

నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా 'లెజెండ్'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం సమర్పించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మించారు. సాయి కొర్రపాటి సమర్పించారు. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే నాయికలు. ఈ సినిమా విడుదలై శుక్రవారానికి 50 రోజులు.

నిర్మాతలు మాట్లాడుతూ "మా సినిమా 50 రోజుల్ని పూర్తి చేసుకుని 100 రోజుల వైపు పరుగులు తీయడం ఆనందంగా ఉంది. బాలకృష్ణగారి నటన, బోయపాటి శ్రీను సినిమాను తీర్చిదిద్దిన విధానం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఉత్తమ నిర్మాణ విలువలు ప్రేక్షకులకు నచ్చాయి. సీమాంధ్ర, తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మా సినిమాకు అదే ఆదరణ చూపిస్తున్నారు. 127 కేంద్రాల్లో 50 రోజుల్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని అన్నారు.

లెజెండ్

లెజెండ్


లెజెండ్ 50 రోజుల విజయోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను.

అభిమానుల సందడి

అభిమానుల సందడి


లెజెండ్ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడంపై బాలకృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బోయపాటి పిల్లలు

బోయపాటి పిల్లలు


లెజెండ్ చిత్రం 50 రోజుల వేడుకలో బోయపాటి కూతురు, కొడుకు కూడా పాల్గొన్నారు.,

జోషిత

జోషిత


బోయపాటి కూతురు జోషిత లెజెండ్ చిత్రంలో ఓచిన్న పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

English summary
Balakrishna and Boyapati Srinu's 'Legend' has completed a successful 50 days run. On this occasion, Boyapati Srinu thanked everyone who is behind the success of the film and said that he tries to continue this success with his next films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu