»   » ఇదో వెరైటీ: 'అమలాపాల్' గా బ్రహ్మానందం

ఇదో వెరైటీ: 'అమలాపాల్' గా బ్రహ్మానందం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా, జిలేబి, పికే... వైవిధ్యమైన పాత్రల పేర్లతో అలరించే బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం రీసెంట్ గా 1000 సినిమాల రికార్డును సైతం బ్రేక్ చేసారు. తాజాగా ఆయన అమలాపాల్ గా కనిపించి అలరించనున్నారు. రవితేజ తాజా చిత్రం బెంగాళ్ టైగర్ లో ఆయన పాత్ర పేరు అమలాపాల్ . ఆ పాత్ర గెటప్ తో ఫొటోను వదిలారు నిర్మాతలు. మీరు ఇక్కడ ఆ ఫొటోని చూడవచ్చు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. సంపత్‌నంది డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం భారీ ఎత్తున ఈ నెల 10న విడుదల అవుతోంది.

Brahmanandam as Amala Paul in Bengal Tiger

ఈ చిత్రంలోని ఓ పాట మేకింగ్‌ వీడియోను చిత్ర దర్శకుడు సంపత్‌నంది తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Hello everyone!! Here is the making video of one of my favourite songs from Bengal tiger, Raye Raye...

Posted by Sampath Nandi on 4 December 2015

రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్‌ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్‌ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.

దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్‌ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.

English summary
Brahmanandam act as Amala Paul in Ravi Teja's Bengal Tiger directed by Sampath Nandi.
Please Wait while comments are loading...