»   » ఇక నవ్వులే: సైతాన్ రాజ్‌గా బ్రహ్మానందం (ఫోటో)

ఇక నవ్వులే: సైతాన్ రాజ్‌గా బ్రహ్మానందం (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నవ్వుల డాన్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమాలో నవ్వుల వర్షం ఖాయం. సినిమాలో ఏమున్నా లేకున్నా... బ్రహ్మానందం ఉన్నాడంటే ఆ సినిమాకు వెళ్లడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే పలు సినిమాల్లో వివిధ పాత్రలు చేసి నవ్వులు పండించిన బ్రహ్మానందం త్వరలో రాబోతున్న 'గీతాంజలి' సినిమాలో సైతాన్ రాజ్ పాత్రలో అలరించబోతున్నారు.

బ్రహ్మానందం పాత్ర గురించి కోన వెంకట్ వెల్లడిస్తూ...'బ్రహ్మానందం గారు నా ఫేవరెట్ యాక్టర్. 'వెంకీై' సినిమా నుండి 'బలుపు' సినిమా వరకు ఆయన కోసం ఎన్నో ఎంటర్టెనింగ్ క్యారెక్టర్లు రాసాను. ఆయన కోసం తాజాగా మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాసాను. ఈ సారి ఆయన్ను గీతాంజలి సినిమాలో 'సైతాన్ రాజ్' పాత్రలో చూడబోతున్నారు. ఈ నెల 17న సైతాన్ రాజ్‌ను పబ్లిక్‌కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం' అని తెలిపారు.

Brahmanandam as Saitan Raj

హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం‌వి‌వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ సమకూర్చారు. ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడిగా, శ్రీజో గేయ రచయితగా పరిచయమవుతున్నారు.

ఆగస్ట్ మొదటి వారంలో సినిమానీ విడుదల చేయబోతున్నారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు తారాగణమైన ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.

English summary
"Brahmanandam Garu is my favourite actor.. Written so many entertaining characters for him from Venky to Balupu.. One more interesting character that I have written is " SAITANRAJ" for our film Geethanjali.. Vr introducing saitanraj to public on 17th July through an event.. All the top comedians of tollywood will be there to launch"Satan Raj".. He's coming to roll u on the floor!! " Kona Venkat said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu