twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విపరీతమైన లాభాలతో ఎంజాయ్ చేద్దామని కాదు: బ్రహ్మానందం

    సాయి కృప ఎంటర్టెన్మెంట్ వారు నిర్మించిన సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాను అందరూ ఆదరించి, భక్తిపారశ్యంలో మునిగి తేలాలని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కోరారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సాయి కృప ఎంటర్టెన్మెంట్ వారు నిర్మించిన సినిమా 'ఓం నమో వెంకటేశాయ' సినిమాను అందరూ ఆదరించి, భక్తిపారశ్యంలో మునిగి తేలాలని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కోరారు. ఈ సినిమా నిర్మించింది దాని ద్వారా వచ్చే లాభాలతో విపరీతంగా ఎంజాయ్ చేద్దామనే భావంతో కాదని, కేవలం భక్తి భావంతో ఒక అద్భుతమైన సినిమా తీసి స్వామి వారి మహిమను ప్రపంచమంతా చాటి చెప్పాలని తీసారని ఆయన తెలిపారు.

    భక్తులకు పండగయా!!('ఓం నమో వేంకటేశాయ' రివ్యూ)భక్తులకు పండగయా!!('ఓం నమో వేంకటేశాయ' రివ్యూ)

    మనకు మంచి సినిమాలు రావడం లేదనే సహజంగా చెప్పుకుంటాం. కానీ మంచి సినిమాలు వచ్చినపుడు ఆదరించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని బ్రహ్మానందం అన్నారు. ఈ సినిమా స్వామి వారి మహిమ గురించి, భక్తుల యొడల ఆయనకున్న అభిమానం, కారుణ్యం గురించి చెప్పే సినిమా అన్నారు.

    ఈ దశాబ్దంలో

    ఈ దశాబ్దంలో

    శ్రీ వెంకటేశ్వర స్వామికి, దర్శకుడు రాఘవేంద్రరావుకు ఉన్న అనుబంధం ఏమిటో నాకు తెలియదు కానీ... గతంలో వెంకటేశ్వర స్వామిపై ఎన్ని సినిమాలు వచ్చినా, ఈ దశాబ్దంలో వెంకటేశ్వరస్వామి గురించిన మహిమల గురించి చెప్పడానికి అతి సమర్థుడైన దర్శకుడు రాఘవేంద్రరావు గారు అని బ్రహ్మానందం అన్నారు.

     సమర్థుడు అని నేను సర్టిఫికెట్ ఇవ్వడం కాదు

    సమర్థుడు అని నేను సర్టిఫికెట్ ఇవ్వడం కాదు

    సమర్థుడు అని నేను ఇచ్చే సర్టిఫికెట్ కంటే స్వామివారే ఆయనకు ఆ రకమైన అర్హత కల్పించి... నా మీద నువ్వు సినిమా తీయ్, నా మీద నువ్వు సినిమాలు తీసి నీ ప్రాచుర్యాన్ని పెంచుకుంటూ నీ భక్తిభావాన్ని నాకు అంకితం చేసుకో అని ఆజ్ఞానుసారం చేసిన సినిమాల్లాగా అనిపిస్తాయి ఒక అన్నమయ్య, ఒక ఓం నమో వెంకటేశాయ అని బ్రహ్మానందం అభిప్రాయ పడ్డారు.

     ఆయన ఎంతో శృంగార భరితమైన సినిమాలు చేస్తారు

    ఆయన ఎంతో శృంగార భరితమైన సినిమాలు చేస్తారు

    రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఒక ఎత్తు... కామిగాని వాడు మోక్షగామి కాడు అన్నట్లు... ఆయన ఎంతో శృంగార భరితమైన సినిమాలు తీస్తారు. ఆయన దానికి ప్రత్యేకత కలిగినటువంటి దర్శకుడు అని ప్రతీతి. అలాంటి ఆయన ఒక్కసారి అద్భుతమైన సీతా కోక చిలుక రూపంలో వచ్చి భక్తి భావంతో స్వామి మీద ప్రతి వాడికి దేవుడు అనే భావన, దేవుడిని నమ్ముకుంటే ఆధ్యాత్మిక భావన, మోక్ష ప్రాప్తి ఎలా జరుగుతుందనే విషయాన్ని విషదీకరించి చెప్పడానికి పూనుకున్న కలియుగ వైనతేయుడు అని బ్రహ్మానందం కొనియాడారు.

     నాగార్జున గురించి

    నాగార్జున గురించి

    వెంకటేశ్వర స్వామి రాఘవేంద్రరావును దర్శకుడిగా ఎంపిక చేసుకుంటే రాఘవేంద్రరావుగాను నాగార్జునను సెలక్ట్ చేసుకోవడం ఇంకా అద్భుతంగా ఉంది. హతీరామ్ బాబాగా నాగార్జున ప్రదర్శించిన నటన అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

    English summary
    Brahmanandam comments about Om Namo Venkatesaya Movie. OmNamoVenkatesaya Movie is a 2017 Telugu devotional & biographical film, based on the life of Hathiram Bhavaji, produced by A. Mahesh Reddy on AMR Sai Krupa Entertainments banner and directed by K. Raghavendra Rao, Starring: Nagarjuna, Anushka, Pragya Jaiswal & Vimala Raman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X