»   » పవన్‌పై పేరడీ...బ్రహ్మీ‘మన ఇంటికి దారేది’

పవన్‌పై పేరడీ...బ్రహ్మీ‘మన ఇంటికి దారేది’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనా ఆ వెంటనే బ్రహ్మీ మార్ఫింగ్ ఫోటోలతో పేరడీ పోస్టర్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దర్శనం ఇవ్వడం ఈ మధ్య మనం చూస్తేనే ఉన్నాం. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'అత్తారింటికి దారేది' పోస్టర్‌కి పేరడీగా బ్రహ్మీ ఫోటోతో 'మన ఇంటికి దారేది' అనే పోస్టర్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులను సైతం ఈ ఫన్నీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కొందరు అభిమానులైతే వీటిని స్వయంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేయడం గమనార్హం. దీన్ని బట్టి బ్రహ్మానందానికి పలువురు హీరోల ఫ్యాన్స్ సర్కిల్లో ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఇక అత్తారింటికి దారేది చిత్రం విషయానికొస్తే...ఈ చిత్రంలో పవన్-బ్రహ్మానందం మధ్య వచ్చే కామోడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నాయి. ఈ చిత్రంలో పవన్ ఓ సీన్లో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సీన్ గుడుంబా శంకర్లో పవన్, బ్రహ్మీ మధ్య నడిచే సీన్ మాదిరి ఉండనుందని టాక్.

ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన శుభం కార్డు సీన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టీవీయాంకర్ గాయిత్రి భార్గవి ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని పూర్తి వినోదాత్మకమైన చిత్రంగా, ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మంచి స్పందన వస్తోంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా పలు రికార్డులు నెలకొల్పిన ఈచిత్రం విడుదల తర్వాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రీణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Brahmanandam 'Mana Intiki Daredi'. Creativity has no bounds. Every time a different look of top hero is out into market, Photo Shop artistic brains bring Brahmanandam into the scene. Brahmanandam photograph has again been morphed for Pawan Kalyan's Attharintiki Daaredhi as 'Mana Intiki Daredi'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu