»   » నేనెప్పుడూ అలా చేయలేదు: రూమర్లపై బ్రహ్మానంద ఇలా!

నేనెప్పుడూ అలా చేయలేదు: రూమర్లపై బ్రహ్మానంద ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో స్టార్ కమెడియన్ గా సుదీర్ఘ కాలంగా తన హవా కొనసాగిస్తున్న వారిలో బ్రహ్మానందం ఒకరు. ఒకానొక సందర్భంలో బ్రహ్మానందం కామెడీ లేకుండా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఉండవు, కొన్నిసినిమాలకు ఆయన కామెడీయే కాసులు కురిపించే మంత్రం అనే విధంగా ఉండేది పరిస్థితి.

అయితే ఈ మధ్య కాలంలో బ్రహ్మాందం హవా తగ్గింది. స్టార్ హీరోల సినిమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. బ్రహ్మానందం బదులు కొత్త తరం కమెడియన్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. బ్రహ్మానందం కామెడీ తెలుగు సినిమాల్లో డిమాండ్ తగ్గిందని, అందుకే ఆయనతో చేయడానికి స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదన సైతం వినిపిస్తోంది.

రెమ్యూనరేషన్ భారీగా ఉండటంతో పాటు... స్క్రిప్టులో వేలు పెట్టడం లాంటివి చేస్తున్నడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు కొత్త దర్శకులైతే బ్రహ్మానందం పని చేయాలంటే చాలా కష్టం అంటూ బెంబేలెత్తిపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ పరిణామాలపై ఇప్పటి వరకు సైలెటుంగా ఉన్న ఆయన ఇటీవల తన సన్నిహితులతో ఈ రూమర్లపై స్పందించినట్లు సమాచారం.

తాను ఎప్పుడూ కూడా కథ, పాత్రల్లో వేలు పెట్ట లేదని, తన గురించి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రచారం జరుగడం తనను విస్మయానికి గురి చేసిందని అన్నట్లు సమాచారం. తాను కేవలం నటుడిని మాత్రమే. దర్శకులు చెప్పినట్టు నటించడం మాత్రమే తాను చేస్తానని అన్నట్లు తెలుస్తోంది. తనకు ఎక్కువ ప్రయారిటీ ఉండే క్యారెక్టర్స్ క్రియేట్ చేయమని ఎప్పుడూ ఎవరినీ కోరలేదని అన్నారట.

కొందరు దర్శకులు, రచయితలతో రిపీటెడ్ గా పని చేసాను. కొన్ని సినిమాలు బాగా ఆడాయి. కొన్ని ఆడలేదు. సినిమా ఆడటం... ఆడక పోవడం కథ, ప్రాత్ర తీరు తెన్నులు, దర్శకత్వం మీదే ఉంటుంది. నేను దర్శకులు చెప్పింది మాత్రమే చేస్తాను. సినిమా ఆడటం ఆడక పోవడం నా చేతుల్లో ఏమీ ఉండదన్నట్లు తెలుస్తోంది.

1000 సినిమాల్లో...
తెలుగు సినీ శ్రమలో కామెడీ డాన్‌ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం పేరు. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం తాజాగా 1000 సినిమాల రికార్డును బ్రేక్ చేసారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్ర బస్సు' చిత్రంతోనే ఆయన ఈ మైలురాయిని దాటారు.

బ్రహ్మానందం

బ్రహ్మానందం


జననం బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్లలో జన్మించారు.

లెక్చరర్ కెరీర్ ప్రారంభం

లెక్చరర్ కెరీర్ ప్రారంభం


అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందేవారు.

కొత్తగా...

కొత్తగా...


ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ... హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేవాడు.

అవార్డులు

అవార్డులు


అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు.

ఫస్ట్ టైం

ఫస్ట్ టైం


మొదటి సారి ఆయనే... బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ.

విడుదలైన తొలి చిత్రం

విడుదలైన తొలి చిత్రం


జంధ్యాల చిత్రం తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం".

English summary
Film Nagar source said that, Brahmanandam Opportunities in down.
Please Wait while comments are loading...