»   » చిరు చెప్పారనే... బ్రహ్మానందాన్ని ఇరికించి, అనుష్కను తప్పించా: వివి వినాయిక్

చిరు చెప్పారనే... బ్రహ్మానందాన్ని ఇరికించి, అనుష్కను తప్పించా: వివి వినాయిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : భారీ సినిమాల విషయంలో బిహైండ్ స్ర్కీన్ జరిగే విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి లాంటి హీరో, వివి వినాయిక్ లాంటి స్టార్ డైరక్టర్, రామ్ చరణ్ లాంటి నిర్మాత ఉన్నప్పుడు మరింతగా ఆ సంఘటనలపై ఇంట్రస్ట్ పెరుగుతుంది. అలాంటి కొన్ని సంఘటనలను దర్శకుడు వివి వినాయిక్ మీడియాకు తెలియచేసారు.

చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్. జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు వివి వినాయిక్.

గతంలో ఠాగూర్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150' గురించి దర్శకుడు వీవీ వినాయక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ 150వ సినిమాను డైరెక్ట్ చేసే సదావకాశం తనకు ఎలా వచ్చిందో కూడా వినాయక్ వివరించారు.

 అభిప్రాయం చెప్పు..

అభిప్రాయం చెప్పు..

‘‘ఒక రోజు అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే వెళ్లాను. నేను వెళ్లాక ‘కత్తి చూశావా నువ్వు' అన్నారు. మామూలుగా చూశాను కానీ, అంత పరిశీలనగా చూడలేదన్నయ్యా అన్నా. ‘ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి, నీ అభిప్రాయం చెప్పు అన్నారు. .

 స్క్రిప్టు రాసుకుని వెళ్లి..

స్క్రిప్టు రాసుకుని వెళ్లి..

పది రోజుల తర్వాత నోట్స్ రాసుకుంటూ చూశా.కత్తి సినిమా చూశాక మేజర్‌గా నాకు అనిపించింది.. కామెడీ బాగా ఉండాలి, తర్వాత పాటలు మంచిగా ఉండాలి అని అనుకుని స్క్రిప్ట్ రాసుకుని వెళ్లి ఎక్స్‌ప్లయిన్ చేశా. ఈ సినిమా అయితే మీకు ఫెంటాస్టిక్‌గా ఉంటుందన్నయ్యా అని చెప్పా.

 ఫెరఫెక్ట్ గా ఉందంటూ..

ఫెరఫెక్ట్ గా ఉందంటూ..

పూర్తిగా మెసేజ్ చెప్పినట్టు కాకుండా.. అలాగని ఏమీ లేకుండా చేస్తే మీ స్టేచర్‌కు కరెక్ట్ కాదు... అదంతా ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ.. నేను రాసుకున్నా నోట్స్ అంతా చెప్పా. చెప్పగానే అన్నయ్య చాలా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు.

 ఒక ఆర్డర్ లో చెప్పా

ఒక ఆర్డర్ లో చెప్పా

తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావుగారితో కూర్చుని మేము అనుకున్న స్క్రిప్ట్‌ను ఒక ఆర్డర్‌లో సెట్ చేసి మళ్లీ అన్నయ్యకు వివరించాను. ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా స్టోరీని నెరేట్ చేశాను. అన్నయ్య లేచి నన్ను హగ్ చేసుకుని ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పారు.

 అనుమానించేలా..

అనుమానించేలా..

అది అయ్యాక రెండుమూడు రోజుల తర్వాత ‘వినయ్ నాకు బ్రహ్మానందం కావాలి' అని అన్నారు. దీంట్లోకి బ్రహ్మానందం పాత్ర ఎలా వస్తుంది అని నేను అనుకుంటుంటే.. ‘వాడు ఏదైనా నన్ను అనుమానించేలాగ, వాడిని నేను ఇరికించేలాగ ఏదైనా వస్తే బాగుంటుందేమో చూడు' అని చిరంజీవిగారే సూచించారు.

 ఇరికించేసాం

ఇరికించేసాం


అప్పడు మళ్లీ ఒక ట్రాక్‌ను పక్కన పెట్టి, బ్రహ్మానందాన్ని ఎలాగోలా ఇరికించేశాం. హీరోయిన్స్ విషయంలో నేను నెరేషన్ ఇచ్చినప్పుడు అనుష్క, కాజల్ అని ఇచ్చా. తర్వాత బ్రహ్మానందాన్ని కొత్తగా అనుకున్నాక సింగిల్ హీరోయిన్ అయింది.

 ఫైనల్ గా కాజల్ నే..

ఫైనల్ గా కాజల్ నే..

తర్వాత ఇంక అనుష్క బిజీ అయిపోయింది. కాజల్ నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్‌ను కూడా సజెస్ట్ చేశారు కానీ, నేను వద్దన్నాను. అయితే కాజల్.. లేదంటే అనుష్క అని ఫిక్సయ్యా. ఫైనల్‌గా కాజల్ ఓకే అయింది.'' అని వినాయక్ చెప్పారు.

 ఆ రెండు సినిమాల్లో..

ఆ రెండు సినిమాల్లో..

మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో హిట్ కొట్టిన ‘రౌడీ అల్లుడు, దొంగ మొగుడు' సినిమాల్లో ఉన్న కామెడీ అంతా ‘ఖైదీ నంబర్ 150'లో ఉంటుందని వినాయక్ చెప్పారు. అలాగే హాస్య నటుడు బ్రహ్మానందాన్ని చిరంజీవి ఆటపట్టించే సీన్లు చాలాబాగా ఉంటాయని వినాయక్ వివరించారు.

 సర్పైజింగ్

సర్పైజింగ్

ఇక డాన్స్‌ల విషయంలో చిరంజీవిని చూసి ఓ మనిషి పట్టుదల ఎలా ఉంటుందో నేర్చుకోవాలనిపిస్తుందని, డ్యాన్స్‌లు అద్భుతంగా చేశారని, ప్రతి పాటలోనూ సర్‌ప్రైజింగ్ స్టెప్స్ ఉంటాయని డైరెక్టర్ వినాయక్ చెప్పారు.

 మంచిది కాదనే

మంచిది కాదనే


‘‘సంక్రాంతికి మా సినిమాని తీసుకురావాలని ముందే అనుకొన్నాం. 12న ‘గౌతమిపుత్ర..' వస్తోంది. అదే రోజున ‘ఖైదీ..' విడుదల కావడం పరిశ్రమకు మంచిది కాదు. అందుకే ఒకరోజు ముందే అంటే... 11న రావాలని నిర్ణయించుకొన్నాం. ఈ నెల 7న ప్రీరిలీజ్‌ వేడుకను విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న హాయ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తున్నాం. అదే రోజున ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి బాబాయ్‌ని ఆహ్వానిస్తా. వస్తారా, రారా అనేది ఆయన ఇష్టం'' అన్నారు రామ్ చరణ్.

 నాన్నతో నటించాలనే..

నాన్నతో నటించాలనే..

ఇంకా ఈ సినిమా గురించి చరణ్‌ చెబుతూ ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. నాన్నతో కలసి నటించాలన్నది నా కల. మంచి కథ వస్తే తప్పకుండా ఆయనతో కలసి ఓ సినిమా చేస్తా. ‘ఖైదీ...'లో 30 సెకన్ల పాటు కనిపిస్తా. కొణిదెల సంస్థలో రెండో చిత్రమూ నాన్నగారితోనే ఉంటుంది. ఆయన 151వ చిత్రాన్ని మా బ్యానర్‌లోనే తీస్తాం. దర్శకుడు ఎవరన్నది త్వరలో చెబుతాము''అన్నారు.

 ఫృధ్వీ సీన్స్ డిలేట్ చేసేసారా

ఫృధ్వీ సీన్స్ డిలేట్ చేసేసారా

ఇక కామెడీ సీన్స్ గురించి మాట్లాడేటప్పుడు తాజాగా ఈ చిత్రంలో నటించిన కమిడియన్ ఫృధ్వీ వివాదం గురించి చెప్పుకోవాలి. ఆ వివాదం క్రింద లింక్ లో చూడవచ్చు.

ఏం తెలివిరా బాబూ!!: ఫేస్ బుక్ పోస్ట్ డిలేట్ చేసి, నేను అనలేదంటూ మీడియాపై షాక్ ఇచ్చిన ఫృధ్వి

English summary
Director V.V Vinayak revealed some interesting titbits about Khaidi No 150 project. Vinayak said that after the entire story was set and rewritten from the original, Chiranjeevi suddenly requested him that he wanted Brahmanandam in the film and Vinayak says this has changed the entire dynamics of the film’s story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu