»   » 'పీకే' గెటప్ లో బ్రహ్మానందం (ఫొటో)

'పీకే' గెటప్ లో బ్రహ్మానందం (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రైల్వే ట్రాక్ మధ్యలో ట్రాన్సిస్టర్ అడ్డంపెట్టుకుని, నగ్నంగా నిలబడ్డ ఆమీర్ ఖాన్ పోస్టర్ గుర్తుండే ఉండి ఉంటుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'పీకే' విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఇప్పుడు తెలుగులో బ్రహ్మానందాన్ని 'పీకే' లుక్ లో చూడవచ్చు. ఆ లుక్ ని హీరో ఆది తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసారు. దాన్ని ఇక్కడ చూడండి.

Here's a working still from my upcoming movie #Garam. With PK.. #Brahamanandam garu :)

Posted by Aadi on 13 September 2015

అయితే బ్రహ్మానందం ఆమీర్ లా నగ్నంగా కాదు కానీ విభిన్న గెటప్ లో దర్శనమిస్తారు. 'గరం' సినిమాలో బ్రహ్మానందంపై ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు ఈ సినిమా వర్గాలు తెలిపాయి. బ్రహ్మానందం స్కర్ట్ ధరించి ట్రాన్సిస్టర్ చేతపట్టుకుని.. ఆమీర్ ఖాన్ ను అనుకరిస్తూ ఓ సన్నివేశంలో నటించినట్టు వెల్లడించాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సీన్ తీసినపుడు కడుపుబ్బ నవ్వుకున్నామని, థియేటర్లలో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేసినట్లు తెలిపాయి. 'పీకే'లో ఆమీర్ ఖాన్ గెటప్ లో ఉన్న బ్రహ్మానందం పోస్టర్ ను విడుదల చేశారు. మదన్ దర్శకత్వం వహిస్తున్న గరం సినిమాలో ఆది, ఆదాశర్మ నటిస్తున్నారు.

ఆది మాట్లాడుతూ ‘‘ఇది నాకు ఏడో చిత్రం. ‘గరం' టైటిల్‌ అందరూ బాగుందంటున్నారు. మంచి కథతో, కొత్తరకం స్ర్కీన్‌ప్లేతో సినిమా తయారవుతోంది'' అన్నారు. ‘హార్ట్‌ ఎటాక్‌' సినిమాలో తనను బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు, ఈ సినిమాలోనూ తన పాత్రను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు అదా శర్మ తెలిపారు.

Brahmanandam to emulate Aamir’s ‘PK’ look in ‘Garam’

మదన్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ నా కథలతోనే సినిమాలు రూపొందించిన నేను మొదటిసారి నా అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ ఇచ్చిన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నా. ప్రేమతో సమస్యను అధిగమించవచ్చనే పాయింట్‌ చుట్టూ కథ నడుస్తుంది. ఆది పోషిస్తున్న పాత్రలో చాలామంది తమను తాము చూసుకుంటారు. అగస్త్య ఫ్రెష్‌ మ్యూజిక్‌ ఇస్తున్నారు'' అని చెప్పారు. వినాయక్‌ వంటి డైరెక్టర్‌ డీల్‌ చేయాల్సిన సబ్జెక్టును మదన్‌ తీస్తున్నారని నిర్మాత రాజ్‌కుమార్‌ అన్నారు. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనేది తమ సంకల్పమనీ తెలిపారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి, స్క్రీప్లే: మదన్‌, పాటలు: చైతన్యప్రసాద్‌, భాస్కరభట్ల రవికుమార్‌, సంగీతం: అగస్త్య, ఛాయాగ్రహణం: టి. సురేంద్రరెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌, కళ: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నాగిరెడ్డి బి., లైన్‌ ప్రొడ్యూసర్‌: హరికృష్ణ జి.

English summary
Brahmanandam, will be seen emulating Aamir Khan‘s popular look from Hindi blockbuster “PK” in upcoming Telugu film “Garam”.
Please Wait while comments are loading...