twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వుల డాన్ బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీ శ్రమలో కామెడీ డాన్‌ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం పేరు. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. అయన 900 పైగా సినిమాల్లో నటించి... ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేవాడు. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

    నేడు బ్రహ్మాందం పుట్టిన రోజు. బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఫిబ్రవరి 1, 1956న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్లలో జన్మించారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందేవారు. 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది.

    ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం". బ్రహ్మానందాని బాగా గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర 'అహనా పెళ్లంట' చిత్రంలో అరగుండు పాత్ర. "...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. అప్పటి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లు స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఈ తరం కమెడియన్లతో కూడా ఆయన పోటీ పడుతూ అగ్ర స్థానంలో నిలిచారంటే ఆయన ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

    బ్రహ్మానందం బర్త్ డే

    బ్రహ్మానందం బర్త్ డే


    బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్లలో జన్మించారు.

    అత్తిలిలో లెక్చరర్‌గా..

    అత్తిలిలో లెక్చరర్‌గా..


    అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందేవారు.

    హాస్యానికి కొత్త ఒరవడి

    హాస్యానికి కొత్త ఒరవడి


    అయన 900 పైగా సినిమాల్లో నటించి... ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ... హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేవాడు.

    గిన్నిస్ బుక్ రికార్డ్

    గిన్నిస్ బుక్ రికార్డ్


    అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు.

    గుర్తింపు తెచ్చిన పాత్ర

    గుర్తింపు తెచ్చిన పాత్ర


    బ్రహ్మానందాని బాగా గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర ‘అహనా పెళ్లంట' చిత్రంలో అరగుండు పాత్ర.

    వెరైటీ పాత్రలు

    వెరైటీ పాత్రలు


    ఆ తర్వాత ఆయన ఖాన్ దాదా, కత్తి రాందాసు, గచ్చిబౌలి దివాకరం పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు.

    మొదటి సారి ఆయనే...

    మొదటి సారి ఆయనే...


    బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ.

    జంధ్యాల చిత్రం

    జంధ్యాల చిత్రం


    తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం".

    స్టార్ హీరోలు సైతం...

    స్టార్ హీరోలు సైతం...


    బ్రహ్మానందం లేకుండా ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా కూడా ఉండదు. అంతలా పాతుకు పోయారు ఇండస్ట్రీలో...

    పుట్టినరోజు శుభాకాంక్షలు

    పుట్టినరోజు శుభాకాంక్షలు


    అందరినీ ఎంతగానో నవ్విస్తున్న బ్రహ్మానందం....ఎప్పుడూ ఇలానే ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ ఉండాలని కోరుకుంటూ వన్ ఇండియా తెలుగు తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood comedy king Brahmanandam turns 58 years today. He was born into a middle class family in Sattenapalli, Guntur district in 1956. The Star comedian seems to be getting better and better with the age. It’s not a surprise that no big budget tollywood movie is without this comedian Brahmanandam. He has been ruling the tollywood from two decades.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X